సాయి పల్లవి ఇలా చేసుందని అస్సలు ఊహించలేదట..అభిమానులు షాక్..!
ఒక్కవేళ సినిమా హిట్ అయ్యి ..ఓ రేంజ్ లో అభిమానులకు రీచ్ అవుతూ..మంచి రెస్పాన్స్ వస్తే ఎలా ఉంటుంది. బోమ్మ అద్దిరిపోతే ధియేటర్స్ దద్దరిల్లాల్సిందే. ఇక ఆ టైంలో ఆ సినిమా తీసిన డైరెక్టర్..హీరోయిన్లు అక్కడే ఉంటే ..రచ్చ రంబోలానేగా. ప్రమోషన్స్ లో భాగమో లేకపోతే వాళ్ల సినిమాకి వచ్చిన సక్సెస్ ని ఎంజాయ్ చేయాలి అనుకున్నారో కానీ..శ్యాం సింగ రాయ్ చిత్ర బృందం ధియేటర్ లో సినిమా చూసి అభిమానులకు షాకింగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది.
రీసెంట్ గా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫిస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సినిమా ‘శ్యామ్ సింగరాయ్’. ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని హీరోగా..మలయాళం ముద్దుగుమ్మ సాయి పల్లవి, కన్నడ సోయగం కృతిశెట్టి హీరోయిన్లుగా నటించి వాళ్ళ నటనకు మంచి మార్కులు వేయించుకున్నారు. ఈ ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా చూసిన ప్రతి ఒక్కరు సినిమా అదుర్స్..కేక..అంటూ పాజిటివ్ రివ్యూస్ ఇస్తూ మరింత హైప్ ఇస్తున్నారు.ఇక ఈ క్రమంలోనే సాయి పల్లవి తన ఫ్యాన్స్‌కు సర్పైజ్ ఇస్తూ.. హైదరాబాద్ మూసాపేటలోని శ్రీరాములు థియేటర్ లో అభిమానులతో పాటు తన సినిమా చూసి సందడి చేసింది.
కానీ తమ పక్కన ఉన్నది హీరోయిన్ సాయి పల్లవి అని వాళ్లకి తెలియకుండా బ్లాక్ బురఖా ధరించి ప్రేక్షకుల మధ్య ఓ సాధారణ ప్రేక్షకురాలిగా కూర్చుని సినిమా చూసి ఎంజాయ్ చేసింది. ఈ సినిమా దర్శకుడు రాహుల్ కూడా తన పక్కనే ఉంటూ ఆయన ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసారు. ఇక ఫైనల్ టచ్ గా సినిమా కంప్లీట్ అయ్యాక ప్రేక్షకులతో పాటు సాయి పల్లవి కూడా నార్మల్ గానే బుర్ఖాలో బయటికి వచ్చింది. ఇక అప్పుడు కార్ దగ్గరికి వచ్చిన తర్వాతే తన ఫేస్ చూయించి అభిమానులకు బై బై చెప్పింది. ఇక దీంతో అభిమానులు షాక్ అయ్యారు..సాయి పల్లవి ఇలాంటి సర్ ప్రైజ్ ఇస్తుందని ఊహించలేకపోయాం అంటున్నారు ఫ్యాన్స్.