సుకుమార్ ను ఖంగారు పెడుతున్న బాలకృష్ణ టార్గెట్ !

Seetha Sailaja
‘అన్ ష్టాపబుల్’ షోలో బాలకృష్ణ చూపిస్తున్న వేగానికి టాప్ దర్శకులు కూడ తట్టుకోలేకపోతున్నారు. ఈమధ్య రాజమౌళితో ఒక ఆట ఆడుకున్న బాలకృష్ణ ఇప్పుడు తన దృష్టిని సుకుమార్ పై పెట్టాడు. లేటెస్ట్ గా బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ఈషోకు ‘పుష్ప’ టీమ్ లో కీలకంగా వ్యవహరించిన సుకుమార్ అల్లు అర్జున్ రష్మిక లు బాలయ్య షోకు అతిధులుగా వచ్చారు.


వారిని కూడ బాలయ్య తన మాటల తూటాలతో ఒక ఆట ఆడుకున్నాడు. ఆహా ఓటీటీ లో ఆదివారం నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఎపిసోడ్ విశేష స్పందనవస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన ఎపిసోడ్స్ లలో ఎంటర్టైన్మెంట్ పరంగా ఇదే బెస్ట్ అని ఈ షోను చూసిన బుల్లితెర ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. బాలయ్య ‘పుష్ప’ లోని డైలాగ్స్ 'తగ్గేదే లే' అనే డైలాగ్ చెప్పి తొడ కొట్టడం 'పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైరూ..' అని చెప్పడం రష్మిక సుకుమార్ లతో కలిసి ‘సామీ సామీ’ స్టెప్పులు వేయడం ఈషోకు హైలెట్ గా మారింది.


ఇదే సందర్భంలో సుకుమార్ వంక చూస్తూ తనతో ఒక సినిమా చేయమని అంతేకాదు ఆసినిమాను మూడు నెలలలో ఎలా వేగంగా తీయాలో తాను సుకుమార్ కు చెపుతాను అంటూ జోక్ చేసాడు.  ఆసినిమాలో ‘ఆరేసుకోబోయి’ ‘ఆకుచాటు పిందె తడిసే' లాంటి పాటలు తనకు రష్మిక కు మధ్య పెట్టమని సుకుమార్ ను అడిగాడు.


దానికి సుకుమార్ స్పందిస్తూ 'మీరు అవకాశం ఇస్తే చేస్తా' అని అనడంతో దసరాకు కొబ్బరికాయ క్రిస్మస్ కు గుమ్మడికాయ సంక్రాంతికి రిలీజ్ చేద్దాం అంటూ సుకుమార్ కు టార్గెట్ ఇచ్చాడు. ఈమాటలకు అల్లు అర్జున్ స్పందిస్తూ 'మీ చేతిలో పడితే కానీ సుకుమార్ సెట్ అవ్వడు' ఆపని చేసి పుణ్యం కట్టుకోండి అంటూ జోక్ చేసాడు. ఇప్పటివరకు బాలయ్య టాప్ డైరెక్టర్స్ ని తనతో సినిమాలు చేయమని అడిగిన సందర్భాలు లేవు అయితే ‘అఖండ’ సక్సస్ తరువాత బాలయ్య ఆలోచనలు మారిపోయి టాప్ డైరెక్టర్స్ కనిపిస్తే చాలు తనతో సినిమా చేయమని ఓపెన్ గా అడుగుతున్నాడు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: