సల్మాన్ ఖాన్ ని పాము ఎన్ని సార్లు కాటు వేసిందో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం!

kalpana
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన డిసెంబర్ 27వ తేదీ తన పుట్టినరోజును జరుపుకోవడం కోసం పన్వేల్‌లోని తన ఫామ్‌హౌస్‌లో జరుపుకోవడం కోసం అక్కడికి వెళ్లడంతో డిసెంబర్ 26వ తేదీ ఉదయం అతడు పాము కాటుకు గురయ్యారు. ఇలా 26వ తేదీ ఉదయం విష రహిత పాము అతడిని కాటు వేసిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇలా పాముకాటుకు గురైన సల్మాన్ ఖాన్ వెంటనే చికిత్స నిమిత్తం ఎమ్‌జీఎమ్ ఆస్పత్రికి బయలుదేరారు.
ఆస్పత్రికి చేరిన సల్మాన్ ఖాన్ కి వైద్యులు వెంటనే చికిత్సను నిర్వహించి అతనికి ఏ విధమైనటువంటి ప్రమాదం లేదని వెల్లడించారు. అయితే కొంత సేపటి వరకు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న సల్మాన్ ఖాన్ అనంతరం ఇంటికి తిరిగి వెళ్లారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు అతను తొందరగా కోలుకోవాలని పెద్దఎత్తున ప్రార్థనలు చేస్తున్నారు.
ప్రతి ఏడాది సల్మాన్ ఖాన్ తన పుట్టినరోజు వేడుకలను తన ఫాంహౌస్లో జరుపుకుంటారు. ఈ క్రమంలోనే తన 56 వ పుట్టిన రోజు వేడుకలను కూడా అదే ఫాంహౌస్లో జరుపుకోవడం కోసం కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. అయితే సల్లూ భాయ్ ఫామ్ హౌస్ అటవీ ప్రాంతంలో ఉండటం వల్ల అక్కడ పెద్ద మొత్తంలో పాములు సంచరిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ బయట తిరుగుతున్న నేపథ్యంలో ఒక విష రహిత పాము సల్మాన్ ఖాన్ పై కాటు వేసింది. అయితే అది విష రహిత పాము కావటం వల్ల అతడి ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదు.
ఈ ఘటనపై సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి కుదుటపడిందని ఎవరూ కూడా ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు కొన్ని మందులను సూచించారు. ప్రస్తుతం తన గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదనీ సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలియడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: