ఓడియమ్మ..స్టార్ హీరో సినిమాలో బిగ్ బాస్ సిరి..అంత ఆయన పుణ్యమే..?
తాజా గా అందుతున్న సమాచరం ప్రకారం బిగ్ బాస్ లో తోటి కంటెస్టేంట్ , ఫ్రెండ్ యూట్యూబర్ అయిన షణ్ముఖ్ జశ్వంత్ తో హగ్గుల తో రెచ్చిపోయిన సిరి కి చిరంజీవి భోళా శంకర్ సినిమాలో నటించే ఆఫర్ వచ్చిన్నట్లు ఓ వార్త నెట్టింట మారుమ్రోగిపోతుంది. హౌస్ లో గేం తో పాటు అందాలు ఆరబోసిన సిరి..టాప్ 5 లో ప్లేస్ సంపాదించుకుని లేడీ టైగర్ అనిపించుకుంది. బిగ్ బాస్ షో తో కావాల్సినంత పాపులారిటీని సంపాదించుకున్న సిరి కి డైరెక్టర్ మెహర్ రమేష్ ఆయన సినిమా లో నటించే అవకాశం ఇచ్చిన్నట్లు టాలీవుడ్ సర్కిల్ లో ఓ వార్త జోరుగా హల్ చల్ చేస్తుంది.
ఒకవేళ ఇదే నిజమైతే..సిరి కెరీర్ మలుపు తిరిగిన్నట్లే .. మెగాస్టార్ లాంటి స్టార్ హీరో సినిమాలో సిరి కి అవకాశం రావడం అంటే మామూలు విషయం కాదు. ఏది ఏమైనా బిగ్ బాస్ హౌస్ నుండి నెగిటివిటీని మూటకట్టుకుని వచ్చిన సిరికి ఈ ఆఫర్ రావడానికి పరోక్షంగా షన్నూ కారణమైయాడు. ఇక షన్ను ని తన లవర్ దీప్తీ దూరం పెడుతున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లో ఆయన పద్ధతి నచ్చకనే దీప్తి ఆయన్ను అవాయిడ్ చేస్తున్నట్లు నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ఇక షన్ను మాత్రం ఆమెను వదిలే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్పాడు.