జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన సమంత..?

frame జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన సమంత..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాను పూర్తి చేశాడు, ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హీరోగా నటించాడు, ఇప్పటికే షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.  ఇలా ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా దేశంలోని ప్రధాన నగరాలకు తిరుగుతున్నాడు, ఈ సినిమా పనులు అన్నీ ముగిసి తర్వాత ఎన్టీఆర్,  కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్న విషయం మనందరికీ తెలిసిందే, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా జరిగిపోయింది.


అలాగే కథ కూడా లాక్ అయినట్లు తెలుస్తోంది, ఇది ఇలా ఉంటే కొరటాల శివ కూడా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు, ఇలా ఆచార్య సినిమా పనులను పూర్తి చేస్తూనే ఎన్టీఆర్ సినిమా పనులను కూడా కొరటాల శివ ప్రారంభించాడు. అయితే గత కొద్ది కాలం క్రితం ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో  కియారా అద్వానీ హీరోయిన్ గా నటించబోతోంది అంటూ అనేక వార్తలు బయటకు వచ్చాయి, అయితే తాజాగా ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి,  కొరటాల శివ కూడా సమంత నే ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూస్తున్నట్లు తెలుస్తోంది,  ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది.  ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది, మరి రెండోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుంది అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: