RRR ఎలా ఉన్నా.. బాహుబలి రికార్డులు టచ్ చేయలేదంతే..!

shami
బాహుబలి అనే సినిమాతో తెలుగు సినిమా స్థాయిని వరల్డ్ వైడ్ గా తెలిసేలా చేశాడు రాజమౌళి. మన సినిమా మహా అయితే నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకుంటే చాలు అనుకునే రోజుల నుండి ప్రపంచం మొత్తం మన సినిమా గురించి మాట్లాడుకునే రోజు వచ్చేలా చేశారు. బాహుబలి ది బిగినింగ్, కన్ క్లూజన్ రెండు సినిమాలు రెండు అద్భుతాలు అని చెప్పొచ్చు. ప్రభాస్, రాజమౌళి, రానా ఐదేళ్ల కష్టానికి ఆ రెండు సినిమాలు ఏర్పరచిన రికార్డులు అన్ని ఇన్నీ కావు.
ఇక ఇప్పుడు బాహుబలి డైరక్టర్ రాజమౌళి నుండి వస్తున్న మరో క్రేజీ మూవీ RRR. ఈసారి ఇద్దరు సూపర్ స్టార్స్ తో రాజమౌళి తన మ్యాజిక్ చూపించాలని ఫిక్స్ అయ్యారు. అంతకుముందు పరిస్థితి వేరు కాని ఇప్పుడు కరోనా వేరియంట్స్ వల్ల ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో అని భయపడాల్సి వస్తుంది. ఓ పక్క రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసి ప్రమోషన్స్ పీక్స్ లో చేస్తుంది rrr టీం. మరోపక్క నార్త్ లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయన్న కారణం వల్ల కొన్ని చోట్ల నైట్ కర్ఫ్యూ.. 50% థియేటర్ ఆక్యుపెన్సీ రూల్ పెట్టారు.            
ఈ పరిస్థితుల్లో rrr రిలీజ్ అయితే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నా వసూళ్లు మాత్రం ఆశించిన స్థాయిలో ఉండవని చెప్పొచ్చు. ముఖ్యంగా బాహుబలి రికార్డులే టార్గెట్ గా వస్తున్న rrr సినిమా మాత్రం బాహుబలి రికార్డులను టచ్ చేసే అవకాశం లేదని చెప్పుకోవచ్చు. బాహుబలి 2000 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఆ ఫిగర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాబట్టడం మాత్రం అసాధ్యమని చెప్పొచ్చు. అంతేగాక కేసులు పెరిగితే మళ్లీ ఎక్కడికక్కడ లాక్ డౌన్ విధించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అలాంటి టైం లో rrr అనుకున్న రేంజ్ లో వసూళ్లు రాబడుతుందా లేదా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: