షాక్: ఆ డైరెక్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన షకీలా..!

Divya
సౌత్ సినిమా పరిశ్రమలోనే.. తనకంటూ ఓ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది నటి షకీలా. మలయాళంలో ఒక శృంగార తారగా పేరు పొందింది. తద్వారా ఆమెకు షకీలా అనే పేరు ను సొంతం చేసుకుంది. ఈమె సౌత్ ఇండియాలో ఉండే అన్ని భాషల తో పాటుగా హిందీలో కూడా పలు సినిమాలలో నటించింది. ఈమె నటించిన కొన్ని సినిమాలు విదేశాలలో కూడా విడుదలయ్యాయి. కానీ 2003 వ సంవత్సరం తర్వాత ఈమె శృంగార సినిమాలకు దూరంగా ఉన్నది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది.


ఇక అలా మొదలుపెట్టిన తర్వాత 20 సంవత్సరాల వరకు ఆమె నటిగా బిజీగా ఉన్నది. ఈమె తన కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఇక ఈమె జీవిత కథ ఆధారంగా ఈమెపై ఒక సినిమాను కూడా తెరకెక్కించడం అయినది. ఈ మూవి గత సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదలైంది. అయితే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడినప్పటికీ.. ఈ సినిమా విడుదలైన కూడా ఫ్లాప్ లిస్టులో మిగిలిపోయింది. ఈ సినిమా డైరెక్టర్ గా ఇంద్రజిత్ లంకేష్ తెరకెక్కించడం జరిగింది. అయితే ఒక ఇంటర్వ్యూలో షకీలా కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

షకీలా మాట్లాడుతూ తన దగ్గరకు వచ్చిన ఎంతో మంది నిర్మాతలు దర్శకులు, బంధువులు ఎవరిని నమ్మలేకపోయాను అని తెలిపింది. ఆమెను ఆర్థిక సహాయం గా వాడుకున్నారని తెలియజేసింది. ఇక తన సినిమా షూటింగ్ మొదలు పెట్టక ముందు డైరెక్టర్ ఇంద్రజిత్తు కూడా  తనతో ఎన్నో విషయాలను చర్చించారని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఆ కథను మాత్రం తన ఇష్టానుసారంగా మార్చేశారని తెలియజేసింది. తన జీవితకథ ఆధారంగా తీస్తున్న సినిమాపై షకీలా కి చాలా ఆశలు ఉండేవట. కానీ అది ఫ్లాప్ అవడంతో ఆమె ఆవేదన వ్యక్తం చేసిందట. ప్రస్తుతం కన్నడ లో ఒక సినిమాలో నటిస్తున్నట్లుగా  తెలిపింది. కానీ నిజ జీవితంలో ఆర్థికంగా స్థిరపడి లేదని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: