శ్యామ్ సింగ రాయ్: సాయి పల్లవి దేవదాసీ పాత్ర చూడాల్సిందేరా
నాని కెరీర్ లో ఇప్పటికే గుర్తుంచు కోదగ్గ పాత్రలు ఎన్నో చేశాడు. ఆ పాత్రల పక్కన ఖచ్చితంగా ఈ పాత్ర చేరుతుందనే చెప్పాలి. అసలు శ్యామ్ సింగ రాయ్ గా నాని నటన , ఆహార్యం, లుక్స్ అన్ని మెప్పించాయి. ఆ పాత్రకు రాసిన డైలాగులు సూపర్బ్. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే కృతి శెట్టి జస్ట్ ఓకే. ఇక మడోన్నా సెబాస్టియన్ పాత్ర కు మరీ జీవం లేనట్టు గా ఉంది.
ఇక ముగ్గురు హీరోయిన్లలో సాయి పల్లవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సాయిపల్లవి తెరపై కనిపించిన తొలి మూమెంట్ నుంచి కూడా చివరి వరకు అంతలా కట్టిపడేసింది. అసలు ఆమె తెర మీద ఉన్నంత సేపు ప్రేక్షకులు చుట్టూ ఏం జరుగుతున్నా మైమరచి పోయి మరీ ఆమెనే చూస్తూ ఉంటారు. చివరకు చిన్న చిన్న ఎక్స్ ప్రెషన్స్ విషయంలో కూడా ఆమె చాలా స్పెషల్ గా నటన చేసింది.
దేవదాసి పాత్రలోని సంఘర్షణ , ఆమె పడే బాధ ఆ ఫీల్ ను ఆమె బాగా ఎక్స్ ప్రెస్ చేయగలిగింది. ఇక నాట్యంతో కూడా ఆమె మెప్పించింది. అసలు దశాబ్దాల క్రితం దేవదాసీ పాత్ర ఇలా ఉంటుందా ? అన్న సంఘటనలు మనకు సాయి పల్లవి పాత్ర చూస్తుంటే కళ్ల ముందు కదలాడేంత గొప్పగా ఆమె నటించింది. ఆమె కోసం అయినా ఈ సినిమా తప్పక చూడాల్సిందే..!