పుష్ప-2 లో ఆమెను చంపేస్తున్న సుకుమార్.. మామూలోడు కాదండోయ్..?
అయితే పుష్ప సినిమా పార్ట్ 1 లో చివరిలో శ్రీవల్లి -పుష్ప రాజ్ లకు పెళ్లి అయ్యిన్నట్లు చూయిస్తారు. ఇక మిగతా కధ పుష్ప ది రూల్ లో ఉంటుంది. అయితే పుష్ప పార్ట్ 2 లో రష్మిక మనకు ఎక్కువ సేపు కనిపించదట. పుష్ప ది రూల్ లో రష్మిక క్యారెక్టర్ ను చంపేస్తున్నాడు సుకుమార్ అంటూ ఓ వార్త నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. పుష్ప పార్ట్ 2 లో పుష్ప రాజ్-శ్రీవల్లి ఎంతో హ్యాపీగా అన్యోన్యంగా ఉండేట్లు మొదట మనకు చూయిస్తారట. అంతేకాదు శ్రీవల్లి ప్రెగ్నెంట్ కూడా అవుతుందని..ఇక ఆ టైంలో భన్వర్ సింగ్ షెకావత్ (ఫాసిల్) పుష్ప పై రీవేంజ్ తీర్చుకునే క్రమంలో శ్రీవల్లి కడుపుతోనే చనిపోతుందని ఓ వార్త బయటకు వచ్చింది.
ఇక పుష్ప పార్ట్ 1 లో పుష్ప రాజ్ వాళ్ళ అమ్మకు దెబ్బతగిలిన్నప్పుడు ఎంత ఎమోషనల్ అవుతాడో మనం చూసాం. ఆ సీన్స్ లో బన్నీ జీవించేసాడు. ఇక పార్ట్ 2 లో శ్రీవల్లి చనిపోతే..ఆ సీన్స్ లో బన్నీ ఎలా నటిస్తాడో మనం ఊహించుకుంటేనే కళ్లల్లో నీళ్ళు తిరుగుతాయి అంటున్నారు అభిమానులు. ఇక ప్రాణంగా ప్రేమించే భార్యని..తన ప్రతిరూపం అయిన బిడ్డని ..భన్వర్ సింగ్ షెకావత్ (ఫాసిల్) చంపినందుకు బన్నీ వైల్డ్ గా మారుతాడట. ఏది ఏమైనా లీక్ అవుతున్న సమాచారం బట్టి పుష్ప ది రూల్ ఓ రేంజ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తుంది.