బన్నీకి పోటీగా నాని..తగ్గేదెలే..

Satvika
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాల జోరు మాములుగా లేదు.. వరుస పెట్టి స్టార్ హీరో ల సినిమాలు అన్నీ విడుదల అవుతున్నాయి. మొన్న అల్లు అర్జున్, సుకుమార్ కాంభినేషన్ లో వచ్చిన పుష్ప డిసెంబర్ 17న విడుదలైంది. సినిమా విడుదల కోసం బన్నీ ఫ్యాన్స్ చేసిన హంగామా మాములుగా లేదు. మంచి టాక్ తో పాటుగా కలెక్షన్స్ ను కూడా రాబట్టడంతో ఇప్పుడు ఈ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇప్పుడు మరో రెండు రోజుల్లో నాని సినిమా విడుదల కాబోతుంది. ఆ సినిమాకు మించి భారీ ప్లాన్లు వేస్తున్నారు.


రాహుల్ సంస్కృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్‌.. ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా విడుదల కానుంది.తెలుగు, తమిళ, మలయాళ, కన్నడలలో విడుదల చేస్తున్నారు చిత్ర యూనిట్. ఈ చిత్ర కథ కలకత్తాలోని సంఘటనల ఆధారంగా రూపొందించారు. కరోనా మొదలైనప్పటి నుంచి నాని రెండు సినిమా లలో నటించారు. ఆ సినిమాలు పెద్దగా రిజల్ట్ ను ఇవ్వలేక పోయాయి.రెండేళ్ల తర్వాత విడుదల కానున్న ఈ సినిమా పై నాని ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.


నాని అభిమానులు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని 70 ఎంఎం థియేటర్‌లో 63 అడుగుల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు.. ఇంకా రెండు రోజులు ఉండగానే అభిమానులు థియెటర్స్ వద్ద భారీగా చేరుకున్నారు. ఆ భారీ కటౌట్‌కు పాలాభిషేకం కూడా చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. ఈ చిత్రం లో నాని రెండు పాత్రలలో కనిపించనున్నాడు.సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ ముగ్గురు హీరోయిన్లు.నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కుతుంది. మిక్కి జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా సెన్సార్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా యు/ఎ సర్టిఫికెట్ ను అందుకుంది. మరి ఈ సినిమా ఎలా వుంటుందో మరో రెండు రోజుల్లో తెలియనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: