మరో మూడు రోజుల్లో థియేటర్లలో శ్యామ్ సింగరాయ్ మూవీ రిలీజ్ కానుందట.. ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేని నాని శ్యామ్ సింగరాయ్ రిజల్ట్ పై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారట..
నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిందట.ఈ సినిమాలో నాని రెండు షేడ్స్ ఉన్న పాత్రలలో కనిపించనున్నారట.అయితే ఈ సినిమా కథకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోందని తెలుస్తుంది.
చంద్రముఖికి శ్యామ్ సింగరాయ్ కు లింక్ ఉందని ప్రచారం జరుగుతోందట.ఇప్పటికే రిలీజైన శ్యామ్ సింగరాయ్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందట.చాలామంది ఈ సినిమా కథ పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కుతోందని భావిస్తున్నా అందులో నిజం లేదని సమాచారం.. టాక్సీవాలా సినిమాతో సక్సెస్ సాధించిన రాహుల్ సాంకృత్యాన్ రెండో సినిమా శ్యామ్ సింగరాయ్ కాగా సినిమాలో నాని సినిమాలపై ఉండే ఇష్టంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదులుకుని డైరెక్టర్ కావాలని ఇండస్ట్రీలోకి వస్తారట.
షార్ట్ ఫిల్మ్స్ చేసిన అనుభవం ఉన్న నాని పీరియాడికల్ సినిమా చేయాలని భావించగా కథ కోసం కోల్ కతాకు వెళతాడట.అక్కడ రైటర్ కమ్ జర్నలిస్ట్ అయిన శ్యామ్ సింగరాయ్ గురించి నానికి తెలుస్తుందట.అయితే నాని తను చేస్తున్న పాత్రలను ఊహించుకుంటూ ఉంటాడట.తనకు ఇష్టమైన శ్యామ్ సింగరాయ్ పాత్రలో నాని లీనమైపోయి ఈ కాలంలో కూడా అదే విధంగా ప్రవర్తిస్తాడట.స్క్రీన్ ప్లే నాని నటించిన రెండు పాత్రలు వేర్వేరు అనేలా కథ సాగుతుందని ఇంటర్వెల్ లో ట్విస్ట్ రివీల్ అవుతుందని తెలుస్తుంది.
చంద్రముఖి సినిమాలో జ్యోతిక ప్రవర్తనలా ఈ సినిమాలో శ్యామ్ సింగరాయ్ పాత్రలో నాని ప్రవర్తన ఉంటుందని తెలుస్తుంది.. సెకండాఫ్ లో నాని ఆ పాత్ర నుంచి బయటకు వచ్చి ప్రస్తుత కాలంలో ఏం చేశాడనేదే క్లైమాక్స్ అని తెలుస్తుంది... ఈ కథ నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందేనట.లవ్ స్టోరీ సక్సెస్ తర్వాత సాయిపల్లవి నటించి రిలీజవుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయని సమాచారం.