యంగ్ టైగర్ జూనియర్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్ సినిమాలు పూర్తి చేశాడు, ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 7వ తేదీ న విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడం తో యంగ్ టైగర్ జూనియర్ఎన్టీఆర్ ఈ సినిమా ప్రమోషన్ కోసం దేశంలోని ప్రధాన నగరాల్లో తిరుగుతూ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు, ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హీరోగా నటిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా పనులు అన్ని ముగిసిన తర్వాత కొరటాల శివ దర్శకత్వం లో సినిమా చేయబోతున్న విషయం అందరికీ తెలిసిందే, ఈ సినిమా కు సంబంధించిన ప్రకటన కూడా ఈ సంవత్సరం ఏప్రిల్ లొనే జరిగిపోయింది.
అయితే ఆర్.ఆర్.ఆర్ సిని మా షూటింగ్ ఆలస్యం అవుతూ రావడం, అలాగే కొరటాల శివ కూడా మెగాస్టార్ చిరంజీవి హీరో గా తెరకెక్కుతున్న ఆచార్య సినిమా పనుల్లో బిజీ గా ఉండటం, అలాగే మధ్య లో కరోనా రావడం ఇలా అనేక కారణాల వల్ల ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా ప్రారంభం ఆలస్యం అవుతూ వచ్చింది, అయితే తాజా గా అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా 2022 మార్చి నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది, అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్క బోతున్న ఈ సినిమా లో పెళ్లి సందD సినిమా తో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న శ్రీ లీల ను హీరోయిన్ గా తీసుకోవాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది, మరి ఈ వార్త పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువ డలేదు.