పెళ్లి ఒకరితో, ఫస్ట్ నైట్ మరొకరితో.. అదే బాలీవుడ్ : తమన్

praveen
ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే అందరూ టక్కున చెప్పేస్తారు ఎస్.ఎస్ తమన్ అని. ఎన్నో రోజుల నుంచి టాలీవుడ్లో స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ తన మ్యూజిక్ తో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాడు. ఇక ఇటీవల కాలంలో తమన్ అందిస్తున్న మ్యూజిక్ చూస్తూ ఉంటే ఏ హీరోకి ఎలా మ్యూజిక్ అందిం చాలన్నది తనకి బాగా తెలుసు అంటూ అర్థమవుతుంది. ఇక ఇటీవల కాలంలో తమన్ అందించిన ప్రతి పాట కూడా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది. చిన్న ల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరిని కూడా అలరిస్తోంది. ఇక తమన్ పాటలు విన్నారంటే చాలు ముసలి వాళ్లు సైతం లేచి డాన్స్ చేస్తున్నారు అని చెప్పాలి.


 అంతలా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఇప్పటివరకు దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎన్నో స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశాడు. ఇక తమన్ అందించిన ఎన్నో పాటలు ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఎవర్ గ్రీన్  పాటలుగా నిలిచిపోయాయి. ప్రతి సినిమాలో సరికొత్త గా మ్యూజిక్ అందిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు తమన్. అయితే ఇటీవలి కాలంలో  అటు బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చాడు తమన్. కొన్ని సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశాడు. గోల్మాల్, సింబా, సూర్య వంశి అనే సినిమాలకు మ్యూజిక్ అందించాడు తమన్. అయితే బాలీవుడ్ నుంచి ఎందుకు మళ్లీ బయటికి వచ్చేశారు అంటూ ప్రశ్నించగా.. గతంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.


 ఇక ఇటీవల మరోసారి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు ఇలాంటి ప్రశ్న ఎదురైంది. ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా వచ్చారు తమన్. అయితే బాలీవుడ్ లో కొన్ని సినిమాలకు మ్యూజిక్ అందించావ్ . కాగా మళ్లీ ఎందుకు అక్కడ నుంచి బయటికి వచ్చారు అని ప్రశ్నించగా.. అక్కడ ఒక సినిమాకి ఆరుగురు మ్యూజిక్ డైరెక్టర్లు ఏంటో నాకు అర్థం కాలేదు అంటూ తమన్ చెప్పుకొచ్చాడు. పెళ్లి ఒకడి తో ఫస్ట్ నైట్ ఒకరితో అన్నట్లుగా బాలీవుడ్లో మ్యూజిక్ డైరెక్టర్ ల పరిస్థితి ఉండేదని ఇక అలాంటి పరిస్థితుల్లో నేను ఇమడలేకపోయా అంటూ తమన్ తెలిపాడు. అందుకే బాలీవుడ్ నుంచి బయటికి వచ్చాను అంటూ అన్నాడు తమన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: