నాలో నాకు నచ్చనిది అదే : బిగ్ బాస్ మానస్

praveen
మొన్నటి వరకు రాత్రి పది అయ్యింది అంటే చాలు బుల్లితెర ప్రేక్షకులు టీవీ ముందుకు వచ్చేశారు. ఎందుకు అంటారా ఇంకెందుకు అందరిని అలరించే బిగ్బాస్ కార్యక్రమం ప్రసారం అవుతుందని. బుల్లితెర ప్రేక్షకులను ఈ సినీ సెలబ్రిటీ రియాలిటీ షో అంతలా ఆకట్టుకుంది అనే చెప్పాలి. దాదాపు వంద రోజులకు పైగా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన ఈ కార్యక్రమం ఆదివారం రోజున గ్రాండ్ ఫినాలే లో ఎంతో మంది అతిథులు మధ్య ఘనంగా ముగిసింది. ఇక ఈ సారి బిగ్ బాస్  ఐదవ సీజన్ లో ప్రేక్షకుల మనసును గెలుచుకున్న సన్నీ ఎక్కువ ఓట్లు గెలుచుకొని  టైటిల్ విన్నర్ గా నిలిచాడు అని చెప్పాలి.

అయితే ఇక బిగ్ బాస్ హౌస్ లో టైటిల్ విన్నర్ ఎవరు అనే దానిపై అటు బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు అని చెప్పాలి. అయితే ఇక బిగ్ బాస్ హౌస్ లో మొదటి నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా గుర్తింపు సంపాదించాడు మానస్. బిగ్ బాస్ హౌస్ లో ఎవరితో గొడవ జరిగినా కూడా ఎంతో కూల్ గా ఉంటూ బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షించాడు. అంతేకాదు మైండ్ గేమ్ ఆడుతూ  హౌస్ లో ఆట కొనసాగించాడు. ఇకఎన్నో ఎలిమినేషన్ లను దాటుకుంటూ వచ్చాడు మానస్. అంతేకాదు బిగ్ బాస్ హౌస్ లో హ్యాండ్సమ్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఇలా ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను ఆకర్షించి మానస్ ఎలిమినేషన్  దాటుకుంటూ  టాప్ ఫైవ్ లో నిలిచాడు.

 ఇటీవల జరిగిన గ్రాండ్ ఫినాలే లో టాప్ త్రీ లో  నిలుస్తాడు అనుకున్నప్పటికీ టాప్ 4 తో  సరిపెట్టుకున్నాడు. అయితే హౌస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత బిగ్ బాస్ బజ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో ఇటీవలే మానస్ పాల్గొన్నారు.. ఈ సందర్భంగా యాంకర్ అరియనా అడిగిన ప్రశ్నలకు పలు ఆసక్తికర సమాధానాలు చెప్పాడు మానస్. మీరు బిగ్ బాస్ హౌస్ లో మైండ్ రీడ్  చేస్తారు అని అంటూ ఉంటారు అది నిజమేనా అంటూ ప్రశ్నించగా.. ఏమో వాళ్ళకే తెలియాలి అంటూ సమాధానం చెప్పాడు. మీలో మీకు నచ్చనిది ఏంటి అంటూ ప్రశ్నించగా నాలో మొండితనం నాకు అస్సలు నచ్చదు. కొన్నిసార్లు ఇంత మొండిగా ఉండకూడదు అని అనిపిస్తూ ఉంటుంది అంటూ ఆసక్తికర సమాధానం చెప్పాడు మానస్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: