సమంత ఇక ఐటెం గర్ల్ గానే కంటిన్యూ కానుందా?

VAMSI
ప్రెజెంట్ టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా వినపడిన మాట పుష్ప. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ అప్డేట్ వచ్చినప్పటి నుండి ఈ సినిమా గురించిన విశేషాలు సోషల్ మీడియాలో హోరెత్తుతూ ప్రేక్షకులను తెగ ఉరించాయి. తాజాగా విడుదలయిన ఈ చిత్రం రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ దుమ్ము దులుపుతోంది. తొలిసారి పాన్ ఇండియా మూవీతో రంగంలోకి దిగిన బన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా రికార్డ్ స్థాయిలో ప్రశంసలను అందుకుంటోంది. ఇక విడుదలకు ముందే విమర్శలను ఎదుర్కొన్న పుష్ప స్పెషల్ సాంగ్ "ఊ కొడతావ మావ..." సినిమాకి హైలెట్ అయ్యిందనే చెప్పాలి.

ఈ పాట  తెరపై ఉన్నంత సేపు ప్రేక్షకులు సీట్లో నిలవలేదు...థియేటర్ మొత్తం విజిల్స్ తో హోరెత్తిపోయింది. ఇందులో సామ్ లుక్ మునుపెన్నడు లేని విధంగా చాలా కొత్తగా ఉంది. ఈ పాటలో అదిరిపోయే డ్యాన్స్ తో యువతని ఫిదా చేసింది సామ్. అయితే ఈ స్పెషల్ సాంగ్ ఆఫర్ తొలుత వేరే హీరోయిన్ కి వచ్చిందట...నిజానికి ఈ సాంగ్ కోసం ముందుగా సమంత లేదా పూజ హెగ్డే అని అనుకున్నారట. అయితే చివరికి సామ్ నే ఫిక్స్ చేశారట ...అలా ఈ స్పెషల్ సాంగ్ ఛాన్స్ పూజ కు మిస్స్ అయ్యిందో లేక మిస్స్ చేసుకున్నారో తెలియదు గానీ మొత్తానికి పుష్ప చిత్రం లో స్పెషల్ సాంగ్ తో సమంత హంగామా మామూలుగా లేదు.

ఈ సినిమా నుండి సమంత హీరోయిన్ గానే కాక, ఒక ఐటెం గర్ల్ గా కూడా బాగా పోల్\పులర్ అయి ఎంతోమంది డైరెక్టర్స్ కు ఛాయస్ గా ఉండనుందా అన్నది తెలియాల్సి ఉంది. ఇక సుకుమార్, బన్నీ కాంబోలో వచ్చిన ఈ హ్యాట్రిక్ మూవీ హిట్ టాక్ గట్టిగానే వినిపిస్తోంది. అల్లు అర్జున్ ఊరమాస్ పర్ఫార్మెన్స్ తో ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పార్టీ ఇచ్చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: