ఇస్మార్ట్ కాంబోలో అర్జున్ రెడ్డి భామ..?

shami
సందీప్ వంగ డైరక్షన్ లో విజయ్ దేవరకొండ, షాలిని పాండే లీడ్ రోల్ లో వచ్చిన సినిమా అర్జున్ రెడ్డి. విజయ్ దేవరకొండకు స్టార్ స్టేటస్ వచ్చేలా చేసిన ఆ సినిమాతో అతని కెరియర్ టర్న్ అయ్యింది. ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన షాలిని పాండే కూడా వరుస ఛాన్సులు అందుకుంది కానీ అమ్మడి కెరియర్ మాత్రం ఆశించిన విధంగా సాగలేదని చెప్పాలి. తెలుగుతో పాటుగా తమిళంలో కూడా షాలిని ప్రయత్నాలు చేసింది. అక్కడ కూడా పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేదు.

ఇక లేటెస్ట్ గా బాలీవుడ్ ఛాన్సులు కూడా అందుకుంటున్న అమ్మడు కొద్దిగా స్లిమ్ గా మారి మళ్లీ తెలుగు తెరపై తన లక్ టెస్ట్ చేసుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలో అమ్మడికి లేటెస్ట్ గా ఓ క్రేజీ లక్కీ ఛాన్స్ ముందుకొచ్చినట్టు తెలుస్తుంది. పూరీ డైరక్షన్ లో ఇస్మార్ట్ కాంబో రిపీట్ కాబోతుంది. పూరీ జగన్నాథ్, రామ్ కాంబినేషన్ లో ఆల్రెడీ ఇస్మార్ట్ శంకర్ హిట్ కాగా ఆ సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో ఒక సినిమా వస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా షాలినిని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.

షాలిని పాండే నిజంగానే పూరీ, రామ్ కాంబో సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ పట్టేస్తే మాత్రం ఆమెకిది చాలా మంచి అవకాశమని చెప్పొచ్చు. టాలీవుడ్ లో కెరియర్ అయిపోయింది అనుకునే టైం లో షాలిని పాండే కి ఈ లక్కీ ఆఫర్ రావడం నిజంగనఏ ఆమె కెరియర్ కు మంచి బూస్టప్ ఇస్తుందని చెప్పొచ్చు. ఇక రిపీట్ అవుతున్న ఈ ఇస్మార్ట్ కాంబో డబుల్ ట్రీట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. లైగర్ తర్వాత త్వరలోనే ఈ సినిమా గురించి డీటైల్స్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. పూరీ డైరక్షన్.. రామ్ హీరోగా షాలిని హీరోయిన్ ఐయితే ఆమె కెరియర్ టర్న్ అవుతుందని చెప్పొచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: