
ఎప్పటికైనా అలాంటి సినిమా తియ్యాలని ఉండేది : రాజమౌళి
అయితే ఇప్పటి వరకు మన కాంబినేషన్లో ఒక్కసారి కూడా సినిమా రాలేదు.. బాలకృష్ణతో సినిమా చేస్తారా అని మా అభిమానులు మిమ్మల్ని అడిగితే ఆయన్ను నేను భరించలేను అని అంటున్నారట ఎందుకు అంటూ రాజమౌళి ని ప్రశ్నించాడు బాలకృష్ణ.. ఇక ఈ ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చాడు బాలకృష్ణ. నేను మిమ్మల్ని హ్యాండిల్ చేయలేను అని భయంతోనేఅలా అన్నాను అంటూ రాజమౌళి తెలిపారు. చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ మీరు అందరికీ గౌరవం ఇస్తారు. చాలా పద్ధతిగా ఉంటారు. నేను సినిమా షూటింగ్ చేసేటప్పుడు ఎలా ఉంటానో నాకే తెలియదు. ఎవరైనా వచ్చి గుడ్ మార్నింగ్ అంటూ నాకు చెబితే చిరాకు పడుతూ ఉంటా. సినిమాలో చేస్తున్నది స్టార్ హీరో నా చిన్న హీరోనా అన్న విషయం కూడా పట్టించుకోను. ఇక ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న హీరో గురించి ఆలోచించను. అందుకే మీతో సినిమా చేయాల్సి వస్తే మీకు ఏమైనా కోపం వస్తుందేమో అని భయం నాకు ఉంటుంది అంటూ రాజమౌళి సమాధానం చెప్పాడు.
ఇక వెంటనే అందుకున్న బాలకృష్ణ నేను ఒక్కసారి క్యారీ వ్యాన్ లో నుంచి బయటికి వచ్చాను అంటే ఇక ఆ రోజు షూటింగ్ అయ్యేంతవరకు మళ్ళీ లోపలికి వెళ్ళను అంటూ బాలకృష్ణ చెప్పుకొచ్చాడు. ఇదే సమయంలో నువ్వు చేసే ప్రతి సినిమాకు ఎందుకు రెండేళ్లు మూడేళ్ల సమయం పడుతుంది అని ప్రశ్నించగా నేను మైండ్లో అనుకున్న విధంగా వస్తుందా లేదా అని ఎప్పుడూ భయపడుతూనే ఉంటా. అందుకే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటాను అందుకే నా సినిమాలు లేట్ అవుతాయి అంటూ రాజమౌళి సమాధానం చెప్పుకొచ్చాడు.అదే సమయంలో మనసులో మాట బయట పెట్టాడురాజమౌళి చిన్నప్పటి నుంచి తనకు సినిమాలంటే ఎంతో ఇష్టమని పెద్ద సినిమాలు తీయాలని ఎంతగానో ఆశపడే వాణి అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు ఎప్పటికైనా 'బెన్ హర్ ' లాంటి సినిమా చేయాలనే ఆలోచనతో ఉండేవాడిని అంటూ రాజమౌళి తెలిపాడు.