పుష్ప : ఆంధ్ర అభిమానులు.. తెలంగాణకు?

praveen
టాలీవుడ్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు అందరూ కూడా పుష్ప మేనియా ఎంజాయ్ చేయడానికి రెడీ అయి పోయారు. అలా వైకుంఠపురం సినిమా లాగానే మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి రికార్డులు తిరగ రాయడానికి అల్లు అర్జున్ కూడా రెడీ అయి పోయాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన పుష్ప సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ సాధించడంతో ఇప్పుడు పుష్ప సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.


 పుష్ప సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన ట్రైలర్స్ సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది అని చెప్పాలి. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులందరికీ ఆ రోజు రానే వచ్చింది. అయితే  పుష్ప సినిమా విడుదల కాబోతున్న నేపథ్యం లో ఆంధ్ర అభిమానులందరూ తెలంగాణకు వచ్చేస్తున్నారు. కారణం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రీమియర్ షోలకు  ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఎలాంటి బెనిఫిట్ షోలు వేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కానీ అభిమానులకేమో బెనిఫిట్ షో చూస్తే ఆ కిక్కే వేరు ఉంటుంది అన్న ఫీలింగ్.



 ఈ క్రమం లోనే ఆంధ్ర అల్లు అర్జున్ అభిమానులు అందరూ ప్రస్తుతం తెలంగాణకు వచ్చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ లోని ఎన్నో థియేటర్ల లో ప్రస్తుతం ప్రీమియర్ షోలు వేయ బోతున్నారు. దీంతో అందరి కంటే ముందు గానే తమ అభిమాన హీరో సినిమా చూడాలని అభిమానులు ఎంత గానో ఆత్రుత పడుతున్నారు  అందుకే ప్రీమియర్ షో చూడ టానికి ఎంతో మంది అభిమానులు తెలంగాణ లో ఉన్న బంధువులు స్నేహితుల ఇంటికి తరలి వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మరి కొంత మంది అభిమానులు పుష్ప సినిమాకు ఆంధ్రాలో కూడా ప్రీమియర్ షోలు వేస్తే ఎంత బాగుంటుంది అంటూ కోరు కుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: