హాట్ టాపిక్ గా మారిన పైడ్ ఫాన్స్ వ్యవహారం !
అయితే ఇప్పటి వరకు ఆ పరిస్థితి సినిమా హీరోలకు ఉండేది కాదు. హీరోలు బయటకు వస్తే చాలు వారిని చూడటానికి జనం ఎగబదతారు. హీరోలు రాజకీయాలలోకి వచ్చి ఎన్నికలలో పోటీ చేసినప్పుడు వారికి ఓట్లు వేసినా వెయ్యకపోయినా హీరోల పై పూల వర్షం కురిపించడం వారికి జైజై లు పలకడం ఒక అలవాటుగా మారిపోయింది.
ఇప్పుడు హీరో అభిమానులలో కూడ కమర్షియల్ ట్రెండ్ బయలు దేరిందా అన్న సందేహాలు చాలామందికి కల్గుతున్నాయి. దీనికి కారణం హీరోల అభిమానులలో కూడ పైడ్ ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు అన్న గుసగుసలు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న ఈ వార్తల ప్రకారం బహిరంగ ప్రదేశాలలో ఏర్పాటు చేస్తున్న ఫిలిం ఫంక్షన్స్ కు అదేవిధంగా ప్రీ ప్రిలీజ్ ఫంక్షన్స్ కు వేలాది జనం రావాలి కాబట్టి సాధారణంగా ఫంక్షన్స్ కు వచ్చే హీరో అభిమానుల సంఖ్యతో పాటు పైడ్ ఫ్యాన్స్ ను కూడ కలుపుతున్నట్లు సమాచారం.
ఇలా ఫిలిం ఫంక్షన్స్ కు వచ్చే పైడ్ ఫ్యాన్స్ కు ఒకొక్కరికీ 700 రూపాయలు ఆ ఫంక్షన్ ను నిర్వహించే నిర్వాహకులు ఇస్తున్నట్లు వార్తలు హడావిడి చేస్తున్నాయి. ఈ వార్తలలో ఎన్ని నిజాలో మనకు తెలియకపోయినా సినిమా హీరోల ఫ్యాన్స్ లో ఇప్పుడు పైడ్ ఫ్యాన్స్ కల్చర్ కూడ జత కడితే సినిమాలు తీసే నిర్మాతల పరిస్థితి ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో జోక్స్ పేలుతున్నాయి..