స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా హాట్ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'పుష్ప'.మరో రెండు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తగ్గేదేలె అంటూ దూసుకురాబోతుంది.ఇక ఈ సంవత్సరం వకీల్ సాబ్, అఖండ లాంటి బడా సినిమాల తర్వాత ఇంకా మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న పెద్ద చిత్రమిది. కాబట్టి ఈ సినిమా ఓపెనింగ్స్ ఎలా రాబోతున్నాయనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ ఉంది. ఇక ఈ 'పుష్ప' సినిమా కేవలం తెలుగులో మాత్రమే కాదు తమిళ,హిందీ,మలయాళం భాషలలో కూడా విడుదలవుతుంది. రాజమౌళి ప్రభాస్ కలయికలో వచ్చిన భారీ కళాఖండం 'బాహుబలి' లానే రెండు పార్టులుగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.ఇక 'పుష్ప ది రైజ్' అనే పక్కా రా టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా డిసెంబర్ 17న ఏకంగా 5 భాషల్లో విడుదల కాబోతుంది.
'అల.. వైకుంఠపురములో' లాంటి మాంచి కం బ్యాక్ హిట్ తర్వాత బన్నీ, 'రంగస్థలం' లాంటి ఊర మాస్ హిట్ తర్వాత సుకుమార్ చేస్తున్న చిత్రం కావడంతో 'పుష్ప' పాన్ ఇండియా లెవెల్లో విజయం సాధించడం ఖాయమని ఫ్యాన్స్ అంతా కూడా భావిస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా..అల్లు అర్జున్ కి బాలీవుడ్ ఆడియెన్స్ లో కూడా మంచి ఫ్యాన్ ఫోలోయింగ్ ఉంది.బన్నీ సినిమాలని హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో వదిలితే ఇక వ్యూస్ తుఫానులా వస్తాయి. అంత క్రేజ్ సంపాదించుకున్నాడు అల్లు అర్జున్.ఇక పుష్ప సినిమాకి ముందు రోజు నాడు ప్రపంచమంతా కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్న 'స్పైడర్ మ్యాన్' విడుదల కాబోతుండడంతో 'పుష్ప' ఓపెనింగ్స్ బాగా డల్ గా ఉన్నాయట. అయినా కాని ధైర్యం చేసి తగ్గేదేలె అంటూ అల్లు అర్జున్ స్పైడర్ మ్యాన్ లాంటి సూపర్ హీరోకి పోటీగా వస్తున్నాడు. ఇక చూడాలి పుష్ప ఎలాంటి హిట్ ని నమోదు చేస్తుందో..టికెట్ రేట్లు పెరిగాయి కాబట్టి ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్ల వర్షం కురిపించే అవకాశం ఉండొచ్చు. చూడాలి పుష్ప ఎంత మేర రాబడుతుందో..