సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చే హీరోయిన్ లు తాము నటించిన మొదటి సినిమా నే బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి, తనకు ఎనలేని పేరు ప్రతిష్టలు మరియు గుర్తింపును తీసుకు రావాలి అని ఆశిస్తూ ఉంటారు. కానీ ఇలా మొదటి సినిమా తోనే అతి కొద్ది మంది హీరోలకు మాత్రమే బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాలు వస్తూ ఉంటాయి. అలా నటించిన మొదటి సినిమా తోనే అదిరిపోయే విజయాన్ని అందుకున్న హీరోయిన్ లలో ఒకరు ఫారియా అబ్దుల్లా. ఈ ముద్దు గుమ్మ నవీన్ పోలిశెట్టి హీరోగా అనుదీప్ కె వి దర్శకత్వం లో తెరకెక్కిన జాతిరత్నాలు సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, కామెడీ ప్రధాన అంశంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.
ఈ సినిమా లో ఈ ముద్దు గుమ్మ చిట్టి పాత్రలో నవ్వులు పూయించి ప్రేక్షకుల మనసు దోచుకుంది. మొదటి సినిమా తోనే బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం అందుకోవడం మాత్రమే కాకుండా ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కించుకున్న ఫారియా అబ్దుల్లా ప్రస్తుతం నాగార్జున హీరో గా తెరకెక్కుతున్న బంగార్రాజు సినిమా లో నటిస్తోంది. తాజా గా ఈ సినిమా లో ఈ ముద్దు గుమ్మ నాగార్జున, నాగ చైతన్య తో కలిసి డాన్స్ చేస్తున్న ఒక పోస్టర్ ను చిత్ర బృందం బయటి కి వదిలింది, ఈ పోస్టర్ కు జనాలు నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే బంగార్రాజు సినిమా లో ఫారియా అబ్దుల్లా ఒక స్పెషల్ సాంగ్ లో కనపడబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి, అయితే మొదటి సినిమా అంత విజయం సాధించి నప్పటికీ రెండవ సినిమాకే స్పెషల్ సాంగ్స్ చేయడం అవసరమా అంటూ పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.