వావ్.. పుష్ప మానియా మొదలైందిగా...!

murali krishna
అల్లు అర్జున్ పుష్ప సినిమా విడుదలకు సిద్దం అయ్యిందట.పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా ను ఈనెల 17న విడుదల చేయబోతున్నారని తెలుస్తుంది.. ఇప్పటికే సందడి వాతావరణం మొదలు అయ్యిందట.

ఈ సినిమా ను పెద్ద ఎత్తున విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారట.ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక తో సినిమా పై అంచనాలు పీక్స్ కు చేరాయని తెలుస్తుంది.బన్నీ మాస్ లుక్ తో పాటు రష్మిక డీ గ్లామర్ అందాల ఆరబోత మరియు సునీల్ మరియు ఫాహద్ ఫాజిల్ ల రౌడీ యిజం ఇంకా అనసూయ పాత్ర అన్నింటికి మించి సమంత ఐటెం సాంగ్‌ ఊర మాస్ లెక్కలు చాలానే ఉన్నాయట.. కనుక పుష్ప సినిమా రచ్చ రచ్చ చేయడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారట.భారీ ఎత్తున అంచనాలున్న పుష్ప సినిమా ను నైజాం ఏరియాలో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారట.

ఏపీలో ఎన్ని థియేటర్లలో విడుదల చేసినా కూడా టికెట్ల రేట్లు చాలా తక్కువగా ఉండటం వల్ల అక్కడ ప్రయోజనం తక్కువే ఉంటుందట.. కనుక నైజాం ఏరియాపై ప్రత్యేక శ్రద్దను పెట్టినట్లుగా సమాచారం.అందులో భాగంగానే నైజాం ఏరియాలో నాలుగు షో లతో పాటు అదనంగా అయిదవ షో కు అనుమతులు ఇవ్వాల్సిందిగా నిర్మాతలు మరియు బయ్యర్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకు విజ్ఞప్తి చేయడం జరిగినట్లు తెలుస్తుంది..

దాంతో ఏం జరుగుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట.పుష్ప సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యిందో లేదో అప్పటి నుండి అంచనాలు భారీ ఎత్తున ఉన్నాయని తెలుస్తుంది.అంచనాలు భారీగా ఉండటం వల్ల అయిదవ షో కు మంచి డిమాండ్ ఉంటుందట.. ఒక వేళ నైజాంలో మొదటి వారం రోజులు అయిదు షో లు పడితే పుష్ప సరికొత్త రికార్డులు నమోదు చేస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోందట.. ఖచ్చితంగా పుష్ప సినిమా వసూళ్ల విషయంలో సరికొత్త రికార్డును నమోదు చేస్తుందని అభిమానులు నమ్మకంగా చెబుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: