రాజమౌళితో సినిమా చేయాలని టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క అగ్రహీరోకి ఉంటుంది. ఎందుకంటే ఆయనతో సినిమా చేస్తే హీరోల జాతకాలు మారిపోతాయి. ప్రస్తుతం టాలీవుడ్లో అగ్ర హీరోలుగా చెలామణి అవుతున్న పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు మినహా మిగతా హీరోలు అందరూ రాజమౌళితో సినిమాలు చేశారు. మహేష్, రాజమౌళి కాంబోలో సినిమా మరికొద్ది రోజుల్లోనే మొదలు కాబోతోంది. దీంతో ఫాన్స్ ఎంతో సంతోషంగా ఉన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ తో సినిమాను తెరకెక్కించలేనని ఇటీవల రాజమౌళి చెప్పిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉండడం..
అందులో రాజమౌళి డైరెక్షన్లో సినిమా అంటే దానికి ఎక్కువ సమయం పట్టడంతో ఈ కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కలేదు. అయితే అల్లు అర్జున్ వైపు నుంచి మాత్రం ఇలాంటి సమస్యలేవీ లేవు. రాజమౌళి దర్శకత్వంలో నటించాలని బన్నీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు. రాజమౌళితో సినిమా చేసి తన మార్కెట్ ని అమాంతం పెంచుకోవాలని అనుకుంటున్నాడు. అయితే బన్నీ కల అయితే ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. రాజమౌళి, మహేష్ బాబు కాంబీనేషన్ లో సినిమా షూటింగ్ పూర్తి కావాలంటే దానికి దాదాపు మూడేళ్లు ఆగాల్సిందే. ఆ తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేస్తారన్నది క్లారిటీ లేదు.
ఇదిలా ఉంటే తాజాగా బన్నీ నటించిన పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి గెస్ట్గా విచ్చేసి బన్నీ పై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడుతూ ఇండస్ట్రీలో ఎక్కువగా కష్టపడే స్టార్ అల్లు అర్జున్ అని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే మా హీరో తో ఎప్పుడు సినిమా చేస్తారు జక్కన్న అంటూ బన్నీ ఫాన్స్ సోషల్ మీడియాలో తెగ కామెంట్లు చేస్తున్నారు. అయితే భవిష్యత్ లోనైనా బన్నీ తో రాజమౌళి సినిమా చేయాలని కోరుకుంటున్నారు మెగా అభిమానులు. మరి ఈ కాంబినేషన్ ఎప్పుడూ సెట్ అవుతుందో చూడాలి. ఇకపోతే బన్నీ తాజాగా నటిస్తున్న పుష్ప సినిమా డిసెంబర్ 17 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది...!!