అక్కినేని వారసుడా మజాకా..సమంతకు అద్దిరిపోయే కౌంటర్ ఇచ్చాడుగా..!!
రీజన్స్ ఏవైనా కానీ భార్య భర్తల బంధానికి విడాకులు పరిష్కారం కాదు అని పెద్దలు అంటున్నా సరే..మేం విడిపోతున్నాం అంటూ ఓ ప్రకటనతో సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలియజేసారు. ఇక అప్పటి నుండి సమంత ఏదో రకంగా తన విడాకుల పై ప్రస్తావిస్తూ..అక్కినేని ఫ్యామిలీని పాయింట్ అవుట్ చేస్తూనే ఉంది. ఇక రీసెంట్ గా హాట్ లుక్స్ తో ఏకంగా ఐటెం సాంగ్ కూడా చేసింది. అక్కడే యవ్వారం చెడింది. సమంత అలా చేయడానికి కారణం నాగచైతన్య.. అతని పై కోపంతోనే ఇలా చేసింది అంటూ వార్తలు వచ్చాయి.
ఇక నాగచైతన్య దీనికి పరోక్షంగా కౌంటర్ ఇచ్చిన్నట్లు తెలుస్తుంది. మీరు ఎలాంటి పాత్రలు చేయడానికి ఓకే చెప్పుతారు అనే ప్రశ్నకు జవాబు ఇస్తూ ఓ ఇంటర్వ్యుల్లో అయ్యన మాటాడుతూ.."నేను ఒక్క యాక్టర్ గా అన్ని రకాల పాత్రలు చేయడానికి ఇష్టపడతాను. ఎలాంటి పాత్రలు చేయడానికి అయినా నేను ఎప్పుడూ సిద్ధమే. కానీ ఆ పాత్ర చేసే ముందు ఒకసారి ఆలోచిస్తా..నేను ఆ రోల్ లో కనిపిస్తే నా ఫ్యామిలీకి ఇబ్బంది అవుతుంది అంటే నేను ఆ పాత్ర ఎట్టిపరిస్ధితిలోను చేయను. నా పాత్ర మా కుటుంబంపై ఎఫెక్ట్ చూపించకూడదు వాళ్లకు చెడ్డ పేరు తీసుకురాకుడదు. మా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే ఆ పాత్రను నేను ఎప్పటికి చేయను' అంటూ చై చెప్పుకొచ్చారు. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు ఇది ఖచ్చితంగా సమంతకి కౌంటర్ నే అంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది.