పూరీ సినిమాల్లో వ్యవస్థ నిజాలు గ్రహించాలి..!
మాఫియా డాన్ కథలు.. గ్యాంగ్ స్టర్స్ స్టోరీస్.. ఇవే పూరీ సినిమా కథా నేపథ్యాలు. అయితే పూరీ తానేదో ఊహించి చూపిస్తున్నాడు అనుకుంటే మన పొరపాటే వ్యవస్థలోని నిజాలని చూపిస్తున్నాడని గ్రాహించాలి. ఆ గట్స్ తన ఒక్కడికే ఉన్నాయని చెప్పాలి. ప్రస్తుతం వ్యవస్థలో జరుగుతున్న అవినీతి.. దుర్మార్గాలను తన కథలుగా ఎంచుకుని మాస్ గా కనిపించే హీరో వ్యవస్థ బాగు కోసం ఏం చేశాడు అన్నదే తన సినిమా కథలుగా రాసుకుంటాడు. పూరీ తన ప్రతి సినిమాలో తన మార్క్ చూపించాలని చూస్తాడు.
అలాంటి ఆలోచనల నుండే పోకిరి, కెమెరా మెన్ గంగతో రాంబాబు, ఇస్మార్ట్ శంకర్ లాంటి కథలు వచ్చాయి. పూరీ సినిమా తీయడం అంటే అరటి పండు తిన్నంత ఈజీ.. కానీ అందులో తను చెప్పే కథలు.. టచ్ చేసే పాయింట్స్ వ్యవస్థ ఇలా ఉంది అని చూపిస్తాడు. ప్రేక్షకులు దాన్ని ఎంతవరకు అర్ధం చేసుకుంటారో అది వారి మైండ్ సెట్ ని బట్టి ఉంటుంది.
ప్రస్తుతం విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా చేస్తున్నాడు పూరీ జగన్నాథ్. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది. పూరీ మార్క్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు సూపర్ హిట్ ఇచ్చేలా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.