మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిన బ్లాక్ వైట్ జోడి.. సూపర్ డాన్స్?

praveen
ప్రస్తుతం బుల్లితెర పై టాప్ కామెడీ షోగా కొనసాగుతున్న జబర్దస్త్ లో ఎప్పుడూ ఏదో ఒక జంట చాలా ఫేమస్ అవుతూ ఉంటుంది. ఇక ఈ టీవీలో ప్రసారమయ్యే అన్ని కార్యక్రమాలలో కూడా  ఆ జంట సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారిపోతూ ఉంటుంది. కేవలం ఆ జంట మధ్య ఉన్న లవ్ ట్రాక్ తోనే కొన్ని కొన్ని షోలు కూడా నడిచిపోతూ ఉంటాయి అని చెప్పాలి. ఇలా జబర్దస్త్ లో ఇటీవలికాలంలో బ్లాక్ అండ్ వైట్ జోడిగా ఎంతగానో గుర్తింపును సంపాదించుకున్నారు ఇమ్మానియేల్, వర్ష జంట. జబర్దస్త్ లో వీరి మధ్య నడిచే లవ్ ట్రాక్ అందరినీ ఆకర్షించింది.


 ఇక ఆ తర్వాత ఈటీవీ లో ప్రసారమయ్యే ఏ కార్యక్రమంలో చూసిన వీళ్ళే సందడి చేశారు. ఇక వీరిద్దరు స్టేజ్ మీద కనిపిస్తే చాలు అటు బుల్లితెర ప్రేక్షకులు కూడా మురిసిపోయారు. కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం వీరి మధ్య లవ్ ట్రాక్ ను కమెడియన్స్ కొంతమంది పంచులతో కామెడీ చేసేసారు. దీంతో ఇక ఇద్దరూ ఒకచోట కనిపించడం మానేసారు.. ఇటీవలి కాలంలో మరోసారి ఈ బ్లాక్ అండ్ వైట్ జోడి ఈటీవీ లోని ప్రతీ కార్యక్రమంలో సందడి చేస్తోంది. ఇక ఈ టీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోలో ఇటీవలే ఈ జంట సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారిపోయింది.



 ఇక వచ్చే వారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల్సింది. ఈ క్రమంలో ప్రోమోలో భాగంగా వర్ష, ఇమాన్యుల్  జంట వరుసగా డాన్స్ పర్ఫార్మెన్స్ లు చేసి అదరగొట్టారు. ఇటీవల కాలంలో ఫేమస్ అయిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలోని లెహరాయి  పాటపై ఇద్దరు కలిసి డాన్స్ చేశారు. ఈ పాటలో వీరిద్దరి కెమిస్ట్రీ అందరినీ ఎంతగానో ఆకర్షించింది. ఇక ఆ తర్వాత రాఘవ లారెన్స్ సినిమా లోని నలుపు నేరేడు వంటి అనే పాటకు డాన్స్ చేసి అదిరిపోయే స్టెప్పులతో ఇరగదీశారు. ఇక ఇటీవల విడుదలైన ప్రోమో లో ఈ జంట పూర్తిగా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇదంతా చూస్తుంటే మరోసారి వీరి లవ్ ట్రాక్ ఊపు అందుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: