రూల్స్ బ్రేక్ చేసిన కాజల్.. బిగ్బాస్ నిర్వాహకులు ఫైర్?

praveen
బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఎన్నో వారాల  నుంచి ఎలిమినేషన్  దాటుకుంటూ వచ్చింది ఆర్జె కాజల్. అయితే ఇటీవలే 14వ వారం లో ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చింది. టాప్ ఫైవ్ లో నిలుస్తుంది అనుకున్న కాజల్ బయటకు రావడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. ఇకపోతే ఇటీవలే బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చిన కాజల్ పై నిర్వాహకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. బిగ్బాస్ నిర్వాహకులు కాజల్ ఫై ఫైర్ అవ్వటానికి కారణం కాజల్ బిగ్బాస్ రూల్స్ బ్రేక్ చేయడమే.



 సాధారణంగా బిగ్ బాస్ ఎపిసోడ్ ని ఒక రోజు లేదా రెండు రోజుల ముందుగానే షూటింగ్ చేస్తూ ఉంటారు. ఇక వారాంతంలో ఎపిసోడ్ ని కూడా ఇలా ఆదివారం రోజు అని చెప్పినప్పటికీ అటు శుక్రవారం లేదా శనివారం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇప్పటికే బిగ్ బాస్ షో పై లీకు వీరులు రెచ్చి పోతూ ఉంటారు. వారంతంలో ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరు అన్నది ముందుగానే లీక్ చేస్తూ ఉంటారు. ఇకపోతే ఇటీవల బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన కాజల్ బిగ్ బాస్ రూల్స్ బ్రేక్ చేసినట్లు తెలుస్తోంది. అయితే వారంతపు ఎపిసోడ్ కూడా రెండ్రోజులు ముందుగానే షూటింగ్ కావడం వల్ల శుక్రవారం లేదా శనివారం కాజల్ హౌస్ నుంచి బయటకు వస్తుంది.


 ఇలా బయటికి వచ్చిన వారు ఆదివారం ఎపిసోడ్ పూర్తయ్యేంత వరకు కూడా మీడియా కంట పడకుండా ఉండాలి అన్న బిగ్ బాస్ రూల్స్  ఉన్నాయట. కానీ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చిన కాజల్ మాత్రం కాస్త తొందరగానే యూట్యూబ్ ఛానల్ లైవ్ లో కనిపించిందట. యూట్యూబ్ ఛానల్ వారు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పిందట. దీంతో ఇక కాజల్ ఈ వారం తప్పకుండా బయటకు వస్తుందని ముందుగానే  అందరికీ అధికారికంగా తెలిసిపోయింది.. కాజల్ ఇలా రూల్స్ బ్రేక్ చేయడం పై బిగ్బాస్ నిర్వాహకులు ఆమెపై ఫైర్ అవుతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజం ఎంత ఉంది అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: