టాప్ హీరోల మనస్థత్వం పై బండ్ల గణేష్ కామెంట్స్ !
ఇలాంటి పరిస్థితులలో ఈమెగా వీరభక్తుడు ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో టాప్ హీరోల మనస్థత్వం పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. టాప్ హీరోలు అంతా తాము నటించే సినిమాలు అన్నీ హిట్ అయి తీరాలి అన్న ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి వారితో సినిమాలు తీసే దర్శకులకు విధేయత కంటే సమర్థత ఎక్కువగా ఉండాలని భావిస్తూ ఉంటారని ఒకవేళ ఆ దర్శకుడు సమర్థుడు అయి ఉండి కొద్దిగా ఇగో ఉన్నప్పటికీ పట్టించుకోకుండా ఆ దర్శకుడు తమకు కోరుకున్న హిట్ ఇవ్వగలడా లేదా అన్నవిషయం ఆలోచిస్తారు తప్పించి పరిచయాలు బంధుత్వాలు సామాజిక సమీకరణాలు గురించి అంతగా పట్టించుకోరు అంటూ కామెంట్స్ చేసాడు.
అంతేకాదు తమతో సినిమాలు తీసే నిర్మాతలు భారీ బడ్జెట్ తో ఎటువంటి సమస్యలు లేకుండా సినిమాలు తీయగలరా లేదా అన్న ఒక్క విషయం ఆలోచిస్తారు కానీ ఇక్కడ కూడ ఆ నిర్మాత తనకు సన్నిహితుడా కాదా అంటూ ఆలోచించరు అంటూ కామెంట్స్ చేసాడు. దీనితో ఇండస్ట్రీలో సక్సస్ ఉంటేనే ఎవరైనా మరొకరి వైపు చూస్తారు అన్న విషయం అందరికీ అర్థం అయ్యేలా బండ్ల గణేష్ ఇంటర్వ్యూ మరొకసారి అద్దం పట్టింది.
‘గబ్బర్ సింగ్’ ఘన విజయం తరువాత ఈమెగా నిర్మాత పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఎంతగానో ప్రయత్నం చేసాడు. పవన్ తన దేవుడు అంటూ అనేకసార్లు ఓపెన్ గా చెప్పినప్పుడు పవన్ నవ్వుతాడు కాని అతడి డేట్స్ ను మాత్రం బండ్ల గణేష్ కు ఇవ్వడం లేదు. దీనితో విసుకు చెంది ఈ బ్లాక్ బష్టర్ నిర్మాత టాప్ హీరోల మనస్తత్వం పై ఇలాంటి కామెంట్స్ చేసి ఉంటాడు అనుకోవాలి..