చిరంజీవి ని టార్గెట్ చేస్తున్న కామెంట్స్ !
ఇలాంటి పరిస్థితులలో ఎన్ని వ్యతిరేక పరిస్థితులు ఉన్నప్పటికీ వాటిని లెక్క చేయకుండా దూసుకు వచ్చిన బాలయ్య ‘అఖండ’ బ్లాక్ బష్టర్ హిట్ గా మారడమే కాకుండా 100 కోట్ల కలక్షన్స్ వైపు పరుగులు తీస్తోంది. దీనితో బాలయ్య మ్యానియా ఆకాశాన్ని అంటటమే కాకుండా రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ పరిస్థితుల మధ్య కొంతమంది సాహసం చేసే విషయంలో బాలయ్యకు చిరంజీవికి మధ్య చాల తేడా ఉంది అంటూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.
ఎప్పుడో చిత్రీకరణ పూర్తి అయిన ‘ఆచార్య’ మూవీ విడుదలకు చిరంజీవి సాహసం చేయలేకపోతే పెద్ద హీరోల సినిమాలకు పెద్దగా కలిసిరాని డిసెంబర్ నెల అయినప్పటికీ ఆ విషయాలను పట్టించుకోకుండా రంగంలోకి దిగి సూపర్ హిట్ కొట్టిన బాలయ్య చిరంజీవి కంటే రియల్ హీరో అంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ఈపరిస్థితులు ఇలా ఉండగా ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘ఆచార్య’ మూవీకి సంబంధించిన కొన్ని సీన్స్ మళ్ళీ రీ షూట్ చేస్తున్నారు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు రావడం ఆశ్చర్యంగా మారింది.
వాస్తవానికి ‘ఆచార్య’ బడ్జెట్ తో పోల్చుకుంటే ‘అఖండ’ చిన్న సినిమా మార్కెట్ పరంగా కూడ ‘అఖండ’ కంటే ఆచార్య’ కు చాల ఎక్కువ రేటు పలికింది. ఈ వాస్తవాలు గ్రహించి చిరంజీవి కొరటాల తమ మూవీని ఫిబ్రవరిలో సంక్రాంతి సినిమాల హడావిడి తరువాత విడుదల చేయడానికి ఆలోచించి ఉంటారు. అయితే ఒమైక్రాన్ ఫిబ్రవరికి విశ్వరూపం దాలుస్తుంది అని వస్తున్న వార్తలు ఒక విధంగా చిరంజీవికి టెన్షన్ కల్గించే అవకాశం ఉంది..