అలా అయితే పుష్ప కు భారీ నష్టం రావడం ఖాయం!!
అయితే భారీ బడ్జెట్ తో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదలయ్యే సమయానికి ప్రేక్షకులు థియేటర్లకు వస్తారో రారో అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే విధంగా ఉందని అందరూ భావించారు. కానీ దీని కంటే ముందే అఖండ చిత్రం భారీ విజయం సాధించి ప్రేక్షకులను ఆకర్షించింది. దాంతో పుష్ప సినిమా ఒక విధంగా సేఫ్ అయినట్లుగానే అందరూ భావించారు. కానీ ఇక్కడ మరొక సమస్య ఏర్పడింది.
అఖండ చిత్రం పుష్ప సినిమా తో పోల్చుకుంటే కొంత తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా అని చెప్పొచ్చు. ఆ సినిమాకు ఏపీ లోని టికెట్ల రేట్లు పెద్దగా ఇబ్బంది పెట్ట లేదు అని చెప్పాలి. కానీ అలాంటి భారీ బడ్జెట్ సినిమాకు ఏపీ టికెట్ రేట్ల సమస్యగా మారుతున్నాయి. అక్కడ టికెట్ రేట్లు ఇప్పుడున్న విధంగా కొనసాగితే మాత్రం సినిమాకు లాభాలు రావడం కష్టమనే చెప్పాలి. ఆ విధంగా ప్రభుత్వాలతో మంతనాలు జరిపి టికెట్ రేట్లను సామాన్య స్థితికి తీసుకు వస్తారా చిత్రబృందం అనేది చూడాలి. ఏదేమైనా భారీ బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కించి విడుదల చేసే సమయానికి ఈ విధంగా ప్రభుత్వాలు సినిమా వారిని ఇబ్బంది పెట్టే విధంగా ఆలోచనలు చేయడం నిజంగా దురదృష్టకరం అని చెప్పాలి.