ఆ కోరిక వల్లే శ్రీయ గప్ చుప్ గా పెళ్లి చేసుకుందట..!!
ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది శ్రియ సరన్..అప్పుడేప్పుడో ఇష్టం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ..ఇప్పుడు వస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కూడా అచ్చం ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఎలా ఉందో అలానే ఉంటూ..అదే ఫిజిక్ మెయిన్ టైన్ చేస్తూ.. సినిమా అవకాశాలు కొట్టేస్తుంది. పెళై ఒక పాప పుట్టినా కూడా ఆమె అందం మాత్రం చెక్కు చెదరనివ్వకుండా కాపాడుకుంటుంది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే చెప్పా చేయకుండా ప్రియుడితో మూడు ముళ్ళు వేయించుకున్న ఈ బ్యూటీ..భర్త తో మీడియా ముందుకు వచ్చి మేం పెళ్లి చేసుకున్నాం మమల్ని ఆశీర్వదించండి అంటూ షాకిచ్చింది. అయితే శ్రియ ఇలా సైలెంట్ గా పెళ్లి చేసుకోవడానికి రీజన్ ఏంటని అందరు చర్చించుకుంటున్న క్రమంలో..ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది.
రష్యన్ వ్యాపారవేత్త ఆండ్రూ తో ఎప్పటి నుండో డేటింగ్ చేస్తున్న శ్రియకి.. పెళ్లి చాలా సింపుల్ గా చేసుకోవాలనే కోరిక ఉండేదట. ఈ కారణంతోనే ఆమె పెళ్లి ఎవ్వరికి చెప్పకుండా రహస్యంగా చేసుకుందంటూ ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తుంది. తన పెళ్లి ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సింపుల్ గా పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా చేసుకోవాలనే కోరిక ఉండడంతోనే ఆమె సీక్రెట్ గా ఆండ్రూ ని పెళ్లాడిందట. ఇక ఈమె తను కడుపుతో ఉన్న విషయానికి కూడా దాచిపెట్టి.. బేబీ పుట్టాక అభిమానులతో పంచుకుందనే విషయం తెలిసిందే.