వామ్మో.. 20 కిలోలు తగ్గిన హీరోయిన్.. ఇప్పుడెలా ఉందంటే?

praveen
కరోనా వైరస్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకునేందుకు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఫిట్గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే సామాన్యుల ఇలా చేస్తుంటే సినీ సెలబ్రిటీలు మరింత ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణంగానే సినీ సెలబ్రిటీలు ఎప్పుడు ఫిట్గా కనిపించడానికి కాస్త సమయం దొరికితే చాలు జిమ్లో కసరత్తులు చేస్తూ ఉంటారు. జీరో సైజ్ మెయింటైన్ చేయడానికి కడుపును కట్టేసుకుని మితంగా ఆహారాన్ని స్వీకరిస్తూ ఉంటారు. అంతేకాదు కొంతమంది హీరోయిన్లు ఏకంగా పాత్రల కోసం భారీగా బరువు తగ్గడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు.  ఇలా ఇప్పటి వరకూ ఎంతోమంది హీరో హీరోయిన్లు పాత్రల కోసం బరువు పెరగడం లేదా బరువు తగ్గడం లాంటివి కూడా చేసి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేశారు.


 అయితే ప్రస్తుతం స్టార్ హీరో హీరోయిన్లు అయితే ఇలా చేస్తే కొత్తగా ఏమీ అనిపించదు. కానీ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి ఇక ఇప్పుడు సీనియర్ నటి గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయిన హీరోయిన్ ఇంకా బరువు తగ్గి సన్నగా ఐతే మాత్రం అందరూ ఆశ్చర్య పోతూ ఉంటారు. ఇప్పుడు అలనాటి హీరోయిన్ ఖుష్బూ  విషయంలో అందరూ ఇలాగే ఆశ్చర్యపోతున్నారు. కుష్బూ అంటే అందరికీ గుర్తొచ్చేది బొద్దుగా ముద్దుగా కనిపించే ఒక అందమైన హీరోయిన్. వయసు పెరిగినప్పటికీ తన అందం అభినయంతో మాత్రం ప్రేక్షకులను ఆకర్షిస్తూనే ఉంటుంది ఖుష్బూ. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా తన హవా నడిపించిన ఈమె ఇప్పుడు సినిమాలో కీలకమైన పాత్రల్లో నటిస్తూ ఉండటం గమనార్హం.



 అయితే గత కొన్ని రోజుల నుంచి ఖుష్బూ సుందర్ బరువు తగ్గడం పై ఫిట్నెస్ సాధించడంపై దృష్టి పెట్టింది. సాధారణంగా ఎవరైనా సరే ఇలా బరువు తగ్గాలి అనుకున్నప్పుడు రెండు కిలోలూ లేదా మూడు కిలోలు తగ్గడం చేస్తూ ఉంటారు. మహా అయితే పది కిలోలు తగ్గుతారు. కానీ కుష్బూ మాత్రం ఏకంగా 20 కిలోల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మొన్నటి వరకు బొద్దుగా ముద్దుగా కనిపించిన కుష్బూ  ఇక ఇప్పుడు జీరో సైజ్ కి మారిపోయినట్లు కనిపిస్తోంది. తాను 20 కిలోల బరువు తగ్గాను అంటూ ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది. బరువు తగ్గిన తర్వాత ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను. ఇంత ఫిట్ గా ఎప్పుడూ నన్ను నేను చూసుకోలేదు ఆరోగ్యమే అసలైన బలం అంటూ కు సోషల్ మీడియా ఖాతాలో తెలిపింది కుష్బూ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: