రాజమౌళి ఒక రాక్షసుడు అంటున్న రాజీవ్ కనకాల...!

murali krishna
ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల స్టూడెంట్ నంబర్ 1 సినిమా నుంచి ఆర్ఆర్ఆర్ వరకు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఎన్నో సినిమాలలో నటించారని తెలుస్తుంది.రాజమౌళిని దగ్గరగా చూసిన వ్యక్తులలో రాజీవ్ కనకాల కూడా ఒకరని అందరికి తెలుసు..
ఒక ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాల రాజమౌళి గురించి చెబుతూ జక్కన్న రాక్షస జాతికి చెందిన వ్యక్తి అని దేవతలను తయారు చేస్తూ ఉంటాడని అన్నారట.స్టూడెంట్ నంబర్ 1 సినిమా సమయంలోనే జక్కన్న విజన్ పెద్దదని రాజీవ్ కనకాల అన్నారని తెలుస్తుంది.
2002 సమయంలోనే తన తర్వాత సినిమాల సీన్లను రాజమౌళి సిద్ధం చేసుకున్నారని రాజీవ్ కనకాల తెలిపారట. 24 గంటలు సినిమా సినిమా అంటూ రాజమౌళి ఆలోచిస్తారని అంత సినిమా పిచ్చోడిని నేను ఎప్పుడూ చూడలేదని రాజీవ్ కనకాల వెల్లడించారట. తనతో షూటింగ్ తర్వాత కూడా తీయబోయే సీన్ మరియు ఆ సీన్ కు తెరకెక్కించే విధానం గురించి జక్కన్న ఎక్కువగా చర్చించేవారని రాజీవ్ కనకాల వెల్లడించారట.
రాజమౌళి సీన్ వివరించే సమయంలో అవతలి వాళ్ల ఎక్స్ ప్రెషన్స్ ను గమనిస్తారని రాజీవ్ పేర్కొన్నారట.
హీరోను అభిమాని ఏ విధంగా ప్రేమిస్తారో రాజమౌళి కూడా హీరోల విషయంలో అంతలా సీన్లు ఉండేలా చూసుకుంటారని రాజీవ్ అన్నారట. రాజమౌళి దగ్గర పట్టుకుందల్లా బంగారం అయ్యేలా టాలెంట్ మరియు పవర్ ఉందని రాజీవ్ అన్నారట.జూనియర్ ఎన్టీఆర్ కు మనోబలం మరియు పట్టుదల ఎక్కువని రాజీవ్ వెల్లడించారట.
జూనియర్ ఎన్టీఆర్ ఏకసంతాగ్రహి అని కూచిపూడి బ్యాక్ డ్రాప్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వచ్చారని వేళ్లతోనే ఎన్టీఆర్ అనుకుంటూ టేక్ అని చెప్పి సీన్లను పూర్తి చేస్తారని రాజీవ్ తెలిపారట. ఎప్పుడు నేర్చుకున్నాడో అర్థం కాని విధంగా ఎన్టీఆర్ ఉంటారని రాజీవ్ పేర్కొన్నారట.రాజమౌళికి మరియు ఎన్టీఆర్ కు రాజీవ్ కనకాల సన్నిహితుడు అనే విషయం అందరికి తెలిసిందే.వారి కుటుంబాలతో మంచి రిలేషన్ ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: