చిరుతో నటించే విషయం పై క్లారిటీ ఇచ్చిన సల్మాన్ ఖాన్ ...!
ఇక ముందుగా ఈ పాత్ర కోసం రామ్ చరణ్ పేరును చిరు పరిశీలించారట.ఆ తర్వాత అల్లు అర్జున్ పేరు లైన్లోకి వచ్చిందని తెలుస్తుంది.ఫైనల్గా సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో ఈ రోల్ చేయడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.. ఈ విషయమై సల్మాన్ మాట్లాడుతూ తనని చిరంజీవి గారు తన చిత్రంలో చేయమని అడిగారని తను `యస్` చెప్పానని అని అన్నారట.దాంతో సల్మాన్ ఖాన్, చిరంజీవి కాంబినేషన్ సెట్ అయ్యినట్లు అయ్యిందని తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కోసం ఓ పాటను కొంచెం పాత్ర నిడివి కూడా పెంచినట్టు తెలుస్తుంది.. అందుకు చిరంజీవితో పాటు చిత్ర యూనిట్ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అందుకు తగ్గేట్టే ఈ సినిమాలో పలు మార్పులు చేర్పులు చేసినట్టు తెలుస్తుంది.మరి చూడాలి సల్మాన్, చిరు కాంబినేషన్ ఎలా ఉండబోతుందో...!
ఇదిలా ఉండగా ఈ సినిమలో వివేక్ ఓబరాయ్ పాత్రలో టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ నటించబోతున్నట్టు వార్త వినిపిస్తుంది.. ఈ సినిమాలో చిరు చెల్లెలు పాత్రలో రమ్యకృష్ణ నటించడం దాదాపు ఖరారైనట్టు తెలుస్తుంది.త్వరలో ఈ విషయమై అఫీషియల్ ప్రకటన చేయనున్నారట . ఈ సినిమా తర్వాత చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో 'భోళా శంకర్' సినిమా చేస్తున్నారని తెలుస్తుంది.