బాలకృష్ణ భక్తి ఛానల్ పై సందేహాలు !

Seetha Sailaja
ప్రస్తుత పరిస్థితులలో ఒక ఛానల్ నిర్వహించడం చాల కష్టమైన పని. మరీ ముఖ్యంగా ఒక భక్తి ఛానల్ నిర్వహించడం మరింత కష్టం. ఇలాంటి సమయంలో బాలకృష్ణ ఏసాహసంతో ఒక భక్తి ఛానల్ ఏర్పాటు చేసే ఆలోచన తనకు ఉంది అంటూ ‘అఖండ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పి ఉంటాడు అంటూ ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి.

బాలకృష్ణ కు ఆవేశం ఉత్సాహం వచ్చినప్పుడు చాల ప్రకటనలు చేస్తూ ఉంటాడు. గతంలో ‘వీరభ్రమేంద్ర స్వామి’ జీవితం పై అదేవిధంగా ‘రామానుజాచార్యులు’ జీవితం పై సినిమా తీయబోతున్నాను అంటూ అనేక సందర్భాలలో చెప్పి ఆవిషయాలు మళ్ళీ మర్చిపోయాడు. అంతేకాదు ‘ఆదిత్యా 369’ సీక్వెల్ తాను తీయబోతున్నానని ఆమూవీకి తానే దర్శకత్వం వహిస్తానని అనేకసార్లు చెప్పి ఇప్పుడు మౌనం వహిస్తున్నాడు.

గతంలో బాలయ్య ‘నర్తనశాల’ సినిమా మొదలుపెట్టి 20 శాతం సినిమా తీసి సౌందర్య చనిపోయింది అన్నకారణంతో ఆసినిమాను క్లోజ్ చేసాడు. ఇప్పుడు బాలయ్య భక్తి ఛానల్ ఆలోచనలు కూడ అలాంటివే అనీ కొందరు అభిప్రాయపడుతున్నారు. ‘అఖండ’ మూవీ సక్సస్ అయితే బాలయ్య భక్తి ఛానల్ ఆలోచనలు ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్ ష్టాపబుల్’ షో తిరిగి ప్రారంభం అయిన తరువాత ఆషోలో బాలయ్య మోక్షజ్ఞ ను కూడ అతిధిగా తీసుకు వచ్చి అతడి పై యూత్ కామెంట్స్ ఎలా ఉంటాయో పరిశీలించాలని బాలయ్య ఆలోచన అని కూడ అంటున్నారు.

ఇలా ప్రస్తుతం రకరకాల ఆలోచన మధ్య ఉన్న బాలకృష్ణ వ్యూహాలు అన్నీ క్లారిటీ లేకుండా ఉన్నాయని ఈవ్యూహాలకు క్లారిటీ రావాలి అంటే ‘అఖండ’ మూవీ సక్సస్ చాల కీలకం అని విశ్లేషకుల అభిప్రాయం. ఈపరిస్థితులు ఇలా ఉంటే బాలకృష్ణ నోటి వెంట ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రస్తావన వచ్చింది కానీ అతడి మాటలలో ఎక్కడా ‘రాథే శ్యామ్’ ‘భీమ్లా నాయక్’ సినిమాల గురించి కనీసం ప్రస్తావించకపోవడంతో ప్రభాస్ పవన్ అభిమానులు బాలయ్యను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: