సమంత కంటే ముందే ఆ హీరోయిన్ ని లవ్ చేసిన నాగచైతన్య..ఎందుకు విడిపోయారో తెలుసా..?

VUYYURU SUBHASH
సినీ ఇండస్ట్రీలోకి వారసులు రావడం చాలా కామన్ అయిన విషయం. మన తెలుగు ఇండస్ట్రీలోనే కాదు పక్క భాషల ఇండస్ట్రీలో కూడా ఎంతో మంది స్టార్ హీరో వారసులు, మనవళ్లు ,మనవరాళ్లు ఆ బడా హీరో ల పేర్లు చెప్పుకుని సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కానీ అలాంటి వారిలో కొందరే సక్సెస్ అయ్యారు. వాళ్లల్లో అక్కినేని నాగచైతన్య కూడా ఒక్కరు. లెజండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వర రావు మనవుడిగా..టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కొడుకుగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన అక్కినేని కుర్రాడు నాగచైతన్య. మొదటి సినిమా జోష్ తో ప్రేక్షకుల్లో జోష్ రప్పించలేకపోయినా.. ఏమాయ చేసావే సినిమాలో మాత్రం సమంత మాయలో పడిపోయాడు. ఇక ఈ సినిమాలో వీరి రొమాన్స్ కి యాక్టింగ్ కి టోటల్ యూత్ ఫిదా అయ్యిపోయింది.
ఇక ఈ సినిమా తరువాత నాగ చైతన్య చాలా సినిమాలు చేసాడు. కానీ వాటిల్లో బాక్స్ ఆఫిస్ దగ్గర భారీ విజయం అందుకున్నవి పట్టుమంటే ఐదు కూడా లేవు. అయినా కానీ నాగార్జున కొడుకు కావడం వల్ల కొందరు డైరెక్టర్స్ ఈయనకు కొత్త అవకాశాలు ఇచ్చారు. ఆ తరువాత  మెల్లిగా మళ్లీ ఫాం లోకి వచ్చాడు. ఇక రీసెంట్ గానే నాగచైతన్య ఎంతో ప్రాణంగా ప్రేమించి..ఇంట్లో ఒప్పించి పెళ్ళి చేసుకున్న సమంత కి విడాకులు ఇవ్వడానికి రెడీ అయ్యాడు. కారణం ఇది అని సరిగ్గా చెప్పలేదు కానీ, మా మాధ్య బాండింగ్ కుదరడం లేదంటూ వివాహ బంధానికి బ్రేకప్ చెప్పేసుకున్నాడు. విడాకుల తరువాత చాలా సైలెంట్ అయిపోయిన చైతూ..అస్సలు మీడియా కంటికి కనిపించడంలేదు.
ఇది ఇలా ఉండగా తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. చైతన్య సమంత కంటే ముందే తనతో  పని చేసిన ఓ హీరోయిన్ తో లవ్ లో పడ్డారట. ఆమె ఎవరో కాదు నట విశ్వ కమల్ హాసన్ పెద్ద కూతురు శృతి హాసన్. వీళ్లిద్దరు కలిసి  ఓ సినిమా చేసారు. నిజానికి అప్పటికే సమంత నాగ చైతన్య లవ్ చేసుకుంటున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ, ఈ సినిమా టైంలో వీళ్లిద్దరు క్లోజ్ గా ఉండడం. పదే పదే మీడియా కంట పడడం తో వీళ్లు లవ్ చేసుకుంటున్నట్లు రూమర్స్ షికారు చేసాయి. ఈ విషయం సమంత కి కూడా తెలుసట. అయితే సమంత నాగచైతన్యకు దగ్గరవ్వదం.. అది చూసిన శృతి ఆయనకు దూరమవ్వడం రెండు ఫాస్ట్ గా జరిగిపోయాయట. అప్పటి వరకు బాగానే ఉన్న చైతన్య ,శృతి..సమంత తో చైతన్య పెళ్లి అయ్యాక వీరు దూరంగా ఉంటున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనా  చైతన్య అటు లవ్ లోను ఫెయిల్  అయ్యారు..ఇటు భర్తగా కూడా ఫెయిల్ అయ్యారు అంటున్నారు నెటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: