'దృశ్యం2' కి ప్రధాన బలం ఆ రెండే..?

Anilkumar
విక్టరీ వెంకటేష్ ఇటీవలే ఓటీటీ వేదికగా నారప్ప సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే కమర్షియల్ కథను పక్కనపెట్టి కంటెంట్ ఉన్న కథలతో వెంకీ మంచి విజయాలను అందుకుంటున్నాడు ఇక వెంకటేష్ హీరోగా నటించిన మరో సినిమా దృశ్యం 2. వెంకటేష్ సరసన మీనా నటించిన ఈ సినిమాకు మలయాళ దర్శకుడు రజీతు జోసెఫ్ దర్శకత్వం వహించాడు. వీరిద్దరూ కలిసి నటించిన ఈ సినిమా ఇవ్వాళ అమెజాన్ ప్రైమ్ లో విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ప్రధానపాత్రలో నటించిన వెంకటేష్ మీనా నటన, కథ,సినిమాలోని క్లైమాక్స్ ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకుంటుంది.

 విక్టరీ వెంకీ మాత్రం రాంబాబు క్యారెక్టర్ లోకి కూరుకుపోయాడు. అయితే ఈ సినిమాలో వీరే కాకుండా పోలీస్ ఆఫీసర్ పాత్రలో వినయ్ వర్మ రాంబాబు లాయర్ గా పూర్ణ ఇంకా పక్కింటి వారిగా కొందరు కీలక పాత్రల్లో నటించారు. దృశ్యం సినిమా తో అందరినీ ఆకట్టుకున్న నదియా ఈ సినిమాలో కూడా అంతకుమించి నటించి అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాను లిమిటెడ్ బడ్జెట్ లోనే పూర్తి చేశాడట మేకర్స్. జీతో జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి ఇ అన్ని డైలాగ్స్ కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ రాసుకున్నారు. దీంతో తను అనుకున్న సక్సెస్ సాధించాడు.

 అనూప్ రూబెన్స్ చక్కటి సంగీతం ఈ సినిమాకు అందించడంతో దీనికి ప్లస్ అయ్యిందని చెప్పవచ్చు. ఏ సినిమాను చూసిన ప్రేక్షకులు అందరూ  మలయాళంలో కంటే బెటర్ గా ఉందని చెబుతున్నారు. ఈ సినిమా మొత్తానికి ప్రధాన బలం దర్శకుడు జీతూ జోసెఫ్ సినిమా కి రాసుకున్న స్క్రీన్ ప్లే మరియు అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి కంపోజ్ చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ఈ రెండు అంశాలు కూడా ఈ సినిమా విజయం విషయంలో ప్రధాన పాత్రలు పోషించాయనే చెప్పాలి. మొత్తంమీద మరో రీమేక్ తో వెంకటేష్ ఆడియన్స్ ను మెప్పించే మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: