యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ప్రేమ కథకు మాస్ అంశాలను జోడిస్తూ తెరకెక్కిన వర్షం సినిమాతో ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇలా వర్షం సినిమాతో టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న ప్రభాస్, ఆ తర్వాత చత్రపతి సినిమా తో టాలీవుడ్ లో తిరుగులేని మాస్ హీరో గా స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత మున్నా, డార్లింగ్, మిర్చి సినిమాలతో ప్రభాస్ ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకుంటూ టాలీవుడ్ టాప్ హీరో గా కొనసాగాడు.
అయితే ఇలాంటి సమయం లోనే దర్శకధీరుడు రాజమౌళి, ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో బాహుబలి సినిమాను తెరకెక్కించాడు. రానా ప్రతినాయకుడి పాత్ర లో కనిపించిన ఈ సినిమా లో అనుష్క, తమన్నా హీరోయిన్ లుగా నటించారు. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్ అనే రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కింది. మొదటి భాగం తోనే ఇండియా వైడ్ గా ఎన్నో రికార్డులను తిరగరాసిన బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్ తో ఇండియా లోనే అత్యధిక కలెక్షన్ లు సంపాదించుకున్న సినిమా చరిత్ర లో కెక్కింది. బాహుబలి సినిమాల ముందు వరకు ప్రభాస్ కేవలం టాలీవుడ్ లో మాత్రమే స్టార్ హీరోగా కొనసాగాడు. కానీ బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్ సినిమాలు విడుదల అయినప్పటి నుండి ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. బాహుబలి ది బిగినింగ్ 10 జూలై 2017 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాగా, బాహుబలి ది కంక్లూజన్ 28 ఏప్రిల్ 2017 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. బాహుబలి సినిమా తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ప్రస్తుతం కూడా ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు.