రజినీకాంత్‌కు సీనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన హెల్త్ టిప్ ఇదే..!

frame రజినీకాంత్‌కు సీనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన హెల్త్ టిప్ ఇదే..!

VUYYURU SUBHASH
దక్షిణ సినీ పరిశ్రమలో యావరేజ్ టాక్ తో సినిమాలు తెరకెక్కినా, సరికొత్త రికార్డులను క్రియేట్ చేసే సత్తా రజినీకాంత్ కు ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కేవలం దక్షిణ భారత దేశమే కాదు దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న రజనీకాంత్.. తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను 60 సంవత్సరాలు దాటినా.. సొంతం చేసుకోవడం ఒక సంచలనం అని చెప్పవచ్చు. ఇక జపాన్ లో కూడా అభిమానులను సొంతం చేసుకున్న ఏకైక సౌత్ ఇండియన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆంధ్ర అన్న గా గుర్తింపు తెచ్చుకున్న నందమూరి తారక రామారావు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటు రాజకీయ పరంగా ఇటు సినీ ఇండస్ట్రీ పరంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న అన్నగారు , ఎంతో మంది ప్రజలను ఆర్థికంగా  కూడా ఆదుకున్నారు. అయితే రజినీకాంత్ ఇండస్ట్రీలోకి రాకముందు బస్ కండక్టర్ గా పని చేసేవారు. అప్పట్లోనే నందమూరి తారకరామారావు అంటే రజనీకాంత్ వీరాభిమానం.

సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఎన్నో పౌరాణిక చిత్రాలను నేను స్వయంగా థియేటర్లలో చూశాను అని రజినీకాంత్ ఒక ఇంటర్వ్యూ  ద్వారా తెలిపాడు. సీనియర్ ఎన్టీఆర్ సినిమాలను చూస్తూ ఉండిపోవడం వల్లే ఆయన పై మరింత అభిమానం పెంచుకున్నాను అని తెలిపాడు రజనీకాంత్. ఒకసారి టైగర్ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి రజనీకాంత్ నటించాడు. ఆ సమయంలో ఎన్టీఆర్ తో రజనీ కాంత్ కలిసి పని చేసేటప్పుడు నరాల సమస్య తో మానసిక ఒత్తిడితో బాధపడేవారు.

రజినీకాంత్ ఆ సమస్యను గుర్తించిన ఎన్టీఆర్ ప్రతిరోజు ఉదయం ప్రాణాయామం చేయమని తెలిపారట. ఎన్టీఆర్ సలహామేరకు రజినీకాంత్ తెల్లవారుజామున ప్రాణాయామం చేసి తన ఆరోగ్యాన్ని కుదుటపరుచుకున్నాడట. ఇక అలా తన ఆరోగ్యం కుదుట పడిన తర్వాత రజనీకాంత్ కొత్త సినిమాలు ప్రకటించడం గమనార్హం. సూపర్ స్టార్ గా సినీ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: