మా నాన్నకు, నాకు కొంచం మెంటల్ : నిహారిక
ఎన్నో రోజుల నుంచి ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమం ప్రస్తుతం బుల్లితెరపై ఎంతగానో గుర్తింపును సంపాదించుకుంది. అయితే ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి సారి ఒక సరికొత్త గెస్ట్ ను పిలిచి.. వారిని ఎన్నో ఆసక్తికర ప్రశ్నలు అడిగి.. అంతకుమించి ఆసక్తికర సమాధానాలను రాబడుతు ఉంటాడు కమెడియన్ అలీ. ఇక ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ఈ షో కి వచ్చారు అంటే పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్ అయి పోవడం లాంటివి కూడా జరుగుతుంది. ఇకపోతే ఇటీవల ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి మెగా డాటర్ నిహారిక స్పెషల్ గెస్ట్ గా వచ్చింది.
ఇటీవలే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ప్రోమోలో భాగంగా వ్యాఖ్యాతగా ఉన్న కమెడియన్ అలీ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పింది మెగా డాటర్ నిహారిక. ఈ క్రమంలోనే మా నాన్నకు కాస్త మెంటల్ అంటూ చెప్పుకొచ్చింది. మా ఫ్యామిలీలో తేజ్ బావ , నేను, చిన్నత్త, మా నాన్నకి కూడా కాస్త మెంటల్ అంటూ చెప్పుకొచ్చింది నిహారిక. ఇక మెగా డాటర్ నిహారిక ఇలాంటి సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు.