యువ హీరోలకు సీనియర్ హీరోలు ఛాలెంజ్..!
బాలకృష్ణ కూడా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ప్లాన్ చేస్తున్నాడు. 'అఖండ' సినిమా సెట్స్‌లో ఉండగానే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాకి సైన్ చేశాడు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతోందీ సినిమా. అలాగే కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తాడనే టాక్ వస్తోంది. ఇప్పటి యంగ్‌హీరోలు ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసేందుకు కూడా కష్టపడుతున్నారు. కానీ మన సీనియర్ హీరోలు షిఫ్టుల్లో సినిమాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి.
వెంకటేశ్ వరుస సినిమాలతో హంగామా చేస్తున్నాడు. ఇప్పటికే 'నారప్ప' డైరెక్ట్‌గా ఓటీటీలో విడదలయింది. అలాగే 'దృశ్యం2' కూడా ఓటీటీలోకి వస్తోంది. అలాగే 'ఎఫ్-3' సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న విడుదల కాబోతోంది. నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్ చేస్తున్నాడు. అలాగే 'సోగ్గాడే చిన్నినాయనా' ప్రీక్వెల్ కూడా మొదలుపెట్టాడు. 'బంగార్రాజు' పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా నటిస్తుండటంతో అక్కినేని అభిమానుల్లో ఉత్కంట చెలరేగుతోంది. మొత్తానికి సీనియర్ హీరోలు.. యంగ్ హీరోలకు సవాల్ విసురుతున్నారు. తమకు తామే సాటి అని నిరూపించుకుంటున్నారు.