సమంతకు బిగ్ ఆఫర్.. చెలరేగిపోతుందిగా..!

NAGARJUNA NAKKA
సమంత కొన్నాళ్లుగా కమర్షియల్‌ సినిమాలకు ఆమడ దూరంలో ఉంది. నాగచైతన్యతో పెళ్లి అయ్యాక ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్‌ సినిమాల్లోనే కనిపించింది. అయితే మళ్లీ ఇప్పుడు సమంత ఆలోచనలు మారుతున్నాయట. సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్ చేస్తోందని ప్రచారం ఊపందుకుంది. ఈ విషయంపై ఫ్యాన్స్ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.
సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సినిమాలకి బ్రేక్‌ ఇస్తుందనే ప్రచారం ఊపందుకుంది. అయితే సమంత మాత్రం నాగచైతన్యతో విడిపోయాక వరుస సినిమాలు.. జోరు చూపిస్తోంది. ఒకవైపు టాలీవుడ్ మరోవైపు కోలీవుడ్ లలో బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేస్తోంది. మేకర్స్ తో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఇక రీసెంట్‌గా రాజమౌళి, మహేశ్ బాబు సినిమాలో ఆఫర్‌ వచ్చిందనే ప్రచారం జరుగుతోంది.
రాజమౌళి తీసే ప్రతీ సినిమాకు హీరోయిన్స్‌ని ఛేంజ్ చేస్తుంటాడు. అనుష్కని మాత్రమే 'విక్రమార్కుడు, బాహుబలి' సినిమాలతో రిపీట్‌ చేశాడు. అయితే మళ్లీ ఇప్పుడు సమంతని రిపీట్‌ చేస్తున్నాడనే టాక్ వస్తోంది. ఇంతకుముందు 'ఈగ' సినిమాకి సమంతని తీసుకున్న రాజమౌళి, తర్వాత మహేశ్‌ బాబు సినిమాకు కూడా సమంతని ప్రిఫర్‌ చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది.
సమంతకి 'ఫ్యామిలీమెన్2' వెబ్‌సీరీస్‌తో నార్త్‌లో కూడా గుర్తింపు వచ్చింది. మహేశ్‌, జక్కన్నసినిమా కూడా పాన్‌ ఇండియన్‌ మూవీగా తెరకెక్కుతుందట. దీనికితోడు మహేశ్ బాబు, సమంత కాంబోలో 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం' సినిమాలు వచ్చాయి. ఈ పెయిర్‌కి మంచి క్రేజ్‌ ఉంది. అందుకే సామ్‌ని ప్రిఫర్ చేస్తున్నాడట జక్కన్న. అయితే మహేశ్‌ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట'తో పాటు త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. సో జక్కన్న, మహేశ్ సినిమా వచ్చే ఏడాది స్టార్ట్ అయ్యే అవకాశముందట.

చూద్దాం.. సమంత సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో. నాగచైతన్యతో విడాకులకు ముందు ఆమె రేంజ్.. విడాకుల తర్వాత ఆమె రేంజ్ ఎలాఉంటుందో. ప్రేక్షకులు కూడా ఈ వ్యవహారంలో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: