డాన్ శీను", "బలుపు" మరియు "పండగ చేసుకో" వంటి సినిమాలకి దర్శకత్వం వహించిన గోపీచంద్ మలినేని ఈ మధ్యనే రవితేజ హీరోగా నటించిన "క్రాక్" సినిమాతో మరోసారి సూపర్ హిట్ అందుకున్నారని అందరికి తెలుసు
ఇక గోపీచంద్ మలినేని ఇప్పుడు నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతున్న విషయం అందరికి తెలిసిందే.
పుల్ మాస్ మసాల కమర్షియల్ అంశాలతో గోపీచంద్ మలినేని,ఈ చిత్రాన్ని ప్లాన్ చేసారని తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ మూవీ ప్రారంభోత్సవం నవంబర్ 13, ఉదయం 10:26 గంటలకు ఘనంగా జరగనుందని తెలుస్తుంది.బాలకృష్ష సరసన శ్రుతీ హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారని సమాచారం.. క్రాక్ వంటి సూపర్ హిట్ ఇచ్చిన గోపిచంద్ మలినేని తదుపరి చిత్రం కావటంతో ఈ సినిమాపై ఓ రేంజిలో ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఈ సారి తన సినిమాకు ఏ నేపధ్యాన్ని తీసుకున్నారనేది హాట్ టాపిక్ గా మారిందని సమాచారం.
అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందనుందని తెలుస్తుంది.బాలయ్య ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయనున్నారని సమాచారం.ఈ సినిమాలో బాలయ్య గూగుల్ సీఈవో గా మరియు ఒక రైతుగా డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నరని తెలుస్తుంది.అలాగే ఈ సినిమా బ్యాక్ డ్రాప్ అమెరికా అని తెలుస్తుంది.దాంతో అమెరికాలో ఈ చిత్రం షూట్ జరగనుందట. వచ్చే సంవత్సరం ప్రారంభంలో యుఎస్ షెడ్యూల్ ప్లాన్ చేసారని ఈ సినిమాకు జై బాలయ్య అనే టైటిల్ అని పెట్టబోతున్నట్లు సమాచారం.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు వెల్లడించనున్నారని తెలుస్తుంది.
ప్రస్తుతం బాలయ్య బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారని అఖండ అనే పవర్ ఫుల్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నారని తెలుస్తుంది.యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ ఈసినిమాలో బాలయ్య సరసన ప్రగ్యాజైశ్వాల్ హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం.అఖండ చిత్రానికి సంబంధించిన పనులన్నీ ముగిసిన తరువాత ఈ ప్రాజెక్ట్‌లోకి అడుగు పెట్టనున్నారట మన నందమూరి బాలకృష్ణ.