యాదమ్మ రాజు గురించి మీకు తెలియని నిజాలివే..??

N.ANJI
బుల్లితెరపై ఎన్నో కామెడీ షోలు ప్రసారం అవుతున్నాయి. ఆ షోలు ఎంతో మందికి జీవనోపాధిని కలిపిస్తున్నాయి. అంతేకాదు.. ఆ షోలకి వచ్చిన వారు ప్రస్తుతం ఇండస్ట్రీలో కమెడియన్స్ గా రాణిస్తున్నారు. అలాంటి వారిలో కమెడియన్ యాదమ్మ రాజు ఒక్కరు. ఆయన బుల్లితెరపై ప్రసారమైన పటాస్ కార్యక్రమం ద్వారా అందరికీ పరిచయమైన సంగతి అందరికి తెలిసిందే.

ఆయన చేసే స్కిట్ లు ఎంతగానో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి. అంతేకాదు.. ఆయన ఎంతో మంది ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. అయితే  యాదమ్మ రాజు ఎన్నో యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలను ఇచ్చిన సంగతి అందరికి తెలిసిన విషయమే. యాదమ్మ రాజు యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రేమకథ గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఒక్కనొక్క సమయంలో యాదమ్మ రాజు  స్కిట్ లో భాగంగా లవ్ ఫెయిల్యూర్ అయినట్లు చేసిన సంగతి అందరికి తెల్సిందే. అంతేకాదు.. ఈ స్కిట్ చుసిన వారంతా కన్నీరు పెట్టుకోకుండా ఉండరు.

అయితే అందరికి విషయం ఏంటంటే.. యాదమ్మ రాజు .నిజజీవితంలో కూడా ఎవరినైనా ప్రేమించారా అని అడగగా అందుకు సమాధానం చెబుతూ..ప్రేమించాను లవ్ ఫెయిల్యూర్ కావడంతో ఆ స్కిట్ అలా పడిందని తన ప్రేమ గురించి చెప్పుకొచ్చారు. రాజు చదువుతున్న రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమించానని తను కూడా తనని ప్రేమించిందని చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. ఒక సంవత్సరం పాటు ఒకరినొకరు ప్రేమించుకున్నట్లు ఈ సందర్భంగా యాదమ్మ రాజు వెల్లడించాడు.

అంతేకాదు.. ఏడాది తర్వాత తను నా దగ్గరికి వచ్చి నువ్వంటే నాకు నచ్చలేదు అంటూ తన లవ్ బ్రేకప్ చెప్పింది అనే విషయాన్ని రాజు  వెల్లడించారు. ఆమె సంవత్సరం పాటు నాతో ఇష్టంగా ఉండి నన్ను ప్రేమించిన వ్యక్తి సడన్ గా నువ్వు నాకు నచ్చలేదు అన్న ఒక కారణంతో తన లవ్ బ్రేకప్ చెప్పిందని రాజు చెప్పుకొచ్చాడు. ఆ విషయాన్ని తలచుకొని ఎన్నో సార్లు బాదపడినట్లు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: