సమంత కేవలం స్టార్ హీరోయిన్ గా మాత్రమే కాదు.. అవసరమైతే ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి ఆపద్బాంధవురాలిగా కూడా మారుతుంది అని నిరూపించుకుంది. ఈమె నిజానికి సినిమాలకే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే కొన్ని సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సమంత ప్రత్యూష ఫౌండేషన్ కు సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులతో పాటు వివిధ రకాల వాణిజ్య ప్రకటనలకు , ఫంక్షన్లకు హాజరైనప్పుడు వచ్చిన డబ్బులు మొత్తం ప్రత్యూష ఫౌండేషన్ కు ఉచితంగా అందిస్తూ తన సహృదయాన్ని చాటుకుంటున్న విషయం తెలిసిందే.
కేవలం బయట వ్యక్తులకు మాత్రమే కాకుండా ఇండస్ట్రీ లో ఉండే సినీ నటులు కూడా తన వంతు సహాయం చేయడంలో సమంత ఎప్పుడూ ముందు ఉంటుంది.. ఇక అందులో భాగంగానే తేజస్వి మడివాడకు కూడా సహాయం చేసింది.. పూర్తి వివరాల్లోకి వెళితే యంగ్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన తేజస్వి మడివాడ చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకుంది. ఇక తండ్రి కూడా తాగుడుకు బానిసయ్యాడు.. ఇక చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు కూడా పడింది.. ఇక ఇంట్లో బాధలు భరించలేక బయటకు వచ్చేసిన ఈమె కాలేజ్ క్యాంపస్ లో ..శరణాలయాల లో ఉంటూ తన చదువును పూర్తి చేసింది..
ఇక అప్పుడే సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేయడం ద్వారా కొంత డబ్బు వచ్చేది.. వాటితో తేజస్వి తన అవసరాలను తీర్చుకునేది.కానీ దాచుకునేంత డబ్బులు ఏవి మిగల్లేదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తీసేటప్పుడు తేజస్వీ కి టీబీ వచ్చింది. ఆపరేషన్ చేయాలన్నారు డాక్టర్స్. కానీ దగ్గర అంత డబ్బులేదు.. విషయం తెలుసుకున్న సమంత ఆపరేషన్ కి అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని చెప్పి తేజస్వి ప్రాణాలను కాపాడింది.. అయితే ఈ విషయాన్ని తేజస్వి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం.. తనతో పాటు తన చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటుంది సమంత అంటూ తేజస్వి , సమంత గురించి గొప్పగా చెప్పింది.