పునీత్ రాజ్ కుమార్ ఆస్థుల పై షాకింగ్ కధనం !
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చనిపోయి రెండు వారాలు అవుతున్నప్పటికీ అతని గొప్పతనం పై రకరకాల వార్తా కథనాలు మీడియాలో వస్తూనే ఉన్నాయి. లేటెస్ట్ గా పునీత్ దాతృత్వానికి సంబంధించిన ఒక న్యూస్ అతడి అభిమానులను మాత్రమే కాకుండా అందరికీ ఆశ్చర్యాన్ని కల్గిస్తోంది.
పునీత్ రాజ్ కుమార్ చనిపోవడానికి కొంతకాలం ముందు 8 కోట్ల రూపాయలను ఫిక్సెడ్ డిపాజిట్ గా వేసి తాను చేస్తున్న సేవాకార్యక్రమాలు ఆగిపోకుండా చూసుకునే విధంగా ఆలోచనలు చేసాడని తెలుస్తోంది. ప్రస్తుతం పునీత్ ఈ లోకంలో లేకపోయినా ఆయన నడుపుతున్నా 16 ఓల్డ్ ఏజ్ హోమ్స్ 26 అనాధ శరణాలయాలు 45 పాఠశాలలు 19 గోసాలలకు సంబంధించిన సేవాకార్యక్రమాలు ఎటువంటి ఆటంకం రాకుండా నిర్వహించేందుకు వీలుగా పునీత్ ఇలా ముందుగానే ఒక భారీ మొత్తాన్ని ఫిక్సెడ్ డిపాజిట్ చేసినట్లు తెలుస్తోంది. ఈవిషయం అతడి కుటుంబ సభ్యులకు కూడ అతడి మరణం తరువాత మాత్రమే తెలిసిందని అంటున్నారు.
పునీత్ రాజ్ కుమార్ మరణానికి ముందు తన నేత్రాలను దానం ఇవ్వడంతో ఇప్పుడు ఆయన మరణించినా ఆయన కళ్ళు ఇంకా కన్నడ దేశంలో బ్రతికే ఉన్నాయి. ఈ పరిస్థితులు ఇలా ఉండగా పునీత్ జీవించి ఉన్నప్పుడు మొదలై చిత్రీకరణ చివరి దశకు వచ్చిన రెండు సినిమాల పరిస్థితి ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. పునీత్ లేటెస్ట్ మూవీ ‘జేమ్స్’ కు సంబంధించిన షూటింగ్ 90 శాతం పూర్తి అవ్వడంతో ఈమూవీని ఎలా విడుదల చేయాలి అని ప్రస్తుతం ఈ నిర్మాతలు మధన పడుతున్నట్లు టాక్.
తెలుస్తున్న సమాచారంమేరకు ఈ మూవీకి సంబంధించిన కథలో మార్పులు చేసి మిగిలిన 10 శాతం షూటింగ్ ను గ్రాఫిక్ వర్క్స్ సహాయంతో పూర్తి చేసి వచ్చే ఏడాది రాబోతున్న పునీత్ రాజ్ కుమార్ పుట్టినరోజునాడు విడుదల చేయాలని ఈ మూవీ నిర్మాతలు ఆలోచనలలో ఉన్నారు..