విజయ్ దేవరకొండను టెన్షన్ పెడుతున్న పుష్పక విమానం ?

Seetha Sailaja
దీపావళి సినిమాల హడావిడి పూర్తి కావడంతో మళ్ళీ ఈవారం నుండి చిన్న సినిమాల హవా మొదలు కాబోతోంది. ఈ రేస్ లో ఈవారం రాబోతున్న ఆనంద్ దేవరకొండ ‘పుష్పకవిమానం’ మూవీని చాల గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఆనంద్ దేవరకొండకు సరైన కమర్షియల్ హిట్ లేకపోవడంతో ఈమూవీ పై అతడు చాల ఆశలు పెట్టుకున్నాడు.


అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది విజయ్ దేవరకొండ హీరోగా ఎంత సక్సస్ అయ్యాడో అతడు నిర్మాతగా తీసిన సినిమాలు మాత్రం ఇప్పటివరకు సరైన ఫలితాన్ని ఇవ్వలేదు. దీనితో మళ్ళీ అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందా లేకుంటే విజయ్ తన సెంటిమెంట్ ను బ్రేక్ చేసుకుని తన తమ్ముడుకి ఒక మంచి హిట్ ఇస్తాడా అన్న విషయం ఈ శుక్రు వారం తేలిపోతుంది.


ఈమూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ అన్న మాటల పై ఇప్పుడు అతడి అభిమానులలో అనేక ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. విజయ్ దేవరకొండ ఈ మూవీ గురించి మాట్లాడుతూ తాను నిర్మిస్తున్న ఈమూవీ అందరికీ బాగా నచ్చుతుంది అని చెపుతూ మధ్యలో ఒక షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. మొన్నటి వరకు మింగిల్ గా ఉన్న తాను ఇప్పుడు సింగిల్ అయ్యాను అంటూ తనకు ఈమధ్యనే బ్రేకప్ అయ్యింది అంటూ విజయ్ దేవరకొండ ప్రకటించగానే అతడి అభిమానులు షాక్ అయ్యారు.


విజయ్ ప్రేమలో ఉన్నాడు అంటూ ఆమధ్య అనేక సార్లు మీడియాలో గాసిప్పులు వచ్చిన విషయం తెలిసిందే. కొందరు విజయ్ రష్మికతో ప్రేమలో ఉన్నాడని ఊహించుకుంటే మరికొందరు ఒక ఇంగ్లీష్ అమ్మాయితో అంటూ ఊహాగానాలలో ఉన్నారు. అయితే ఇవేమీ కావని ఆమధ్య విజయ్ క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇప్పుడు మళ్ళీ బ్రేకప్ అని అంటున్నాడు. దీనితో విజయ్ బ్రేకప్ చెప్పింది ఎవరికీ అంటూ మళ్ళీ చర్చలు మొదలయ్యాయి. మరి కొందరు అయితే మరొక అడుగు ముందుకు వేసి  రౌడీ స్టార్ కు బ్రేకప్ శుభాకాంక్షలు అంటూ జోక్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: