టాలీవుడ్ హీరో కింగ్ నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అరవై పదుల వయసులో కూడా ఎంతో యంగ్ గా, ఎనర్జిటిక్ గా కనిపిస్తారు నాగ్. ఈ వయసులో కూడా నాగార్జున తన ఫిజిక్ ని చాలా బాగా మెయింటైన్ చేస్తుంటారు. ముఖ్యంగా తన ఫిజిక్ మెయింటెనెన్స్ విషయంలో అమల గారి స్పెషల్ కేర్ చాలా ఉంటుంది. దీనికి తోడు మన నాగార్జున డ్రస్ మెయింటెనెన్స్ తన ఇద్దరు కొడుకులను మించేవిధంగా ఉంటుంది. ఇక ముఖ్యంగా నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షో లో ఆయన వేసుకునే కాస్ట్యూమ్స్ వరల్డ్ లోనే టాప్ మోస్ట్ బ్రాండ్స్ అని తెలుస్తోంది.ఆ షోలో నాగార్జున వేసే కాస్ట్యూమ్స్ ఎంతో స్టైలిష్ గా, స్పెషల్ గా ఉంటాయి.
ఇక వీకెండ్ వచ్చిందంటే చాలు ఆ ఎపిసోడ్ ని కేవలం నాగార్జున కోసం మాత్రమే చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక వీకెండ్ ఎపిసోడ్ లో నాగ్ ఒక్కో వారం ఒక్కో రకంగా తన స్టైలిష్ కాస్ట్యూమ్స్ తో దర్శనమిస్తూ వుంటారు. ఈ నేపథ్యంలో గత వారం వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున వేసుకున్న షర్ట్ పై అందరి దృష్టి పడింది. ఈ క్రమంలోనే నాగర్జున వేసుకున్న షర్ట్ గురించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గతవారం వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున పైస్లీ సిల్క్ షర్ట్ వేసుకుని.. అదిరిపోయే లుక్‌తో ఆడియన్స్ ని అలరించాడు. అయితే ఈ షర్టు రేటెంత ఉంటుందని కొందరు అభిమానులు గూగుల్ లో సెర్చ్ చేయగా..ఆ షర్ట్ రేటు $1,110 యూఎస్ డాలర్స్ అని తెలిసింది.
ఇక ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం చూసుకుంటే దీని ధర అక్షరాలా 82,211 రూపాయలు. దీంతో ఈ షర్ట్ రేట్ చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ కి గురవుతున్నారు. దీంతో ఒక్క షర్టు రేటు 82 వేల అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. మరికొందరు నాగార్జున 60 ఏళ్లలో కూడా 25 ఏళ్ల కుర్రాడిలా చూడాలి అంటే ఆ మాత్రం ఉండాలి కదా అంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి కాస్ట్యూమ్స్ విషయంలో మాత్రం నాగ్ ఏమాత్రం తగ్గటం లేదు. ఇక ప్రస్తుతం నాగార్జున సినిమా విషయానికి వస్తే.. ఇటీవలే 'బంగార్రాజు' సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. నాగచైతన్య కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం...!!