త్రివిక్రమ్ స్క్రిప్ట్ అందించిన మొదటి సినిమా ఇదే..!!

Anilkumar
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కేవలం స్టార్ హీరోలతో మాత్రమే సినిమాలు డైరెక్ట్ చేసి దర్శకుడిగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ప్రస్తుతం అగ్ర దర్శకుల్లో ఒకడిగా వెలుగొందుతున్న త్రివిక్రమ్.. కెరీర్ స్టార్టింగ్ లో రచయితగా మారి పలు సినిమాలకు రైటర్ గా పని చేశారు. ముఖ్యంగా గా దర్శకుడు విజయభాస్కర్ తో కలిసి త్రివిక్రమ్ రైటర్గా పని చేసిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మధుడు వంటి సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇక ఆ తర్వాత 'నువ్వే నువ్వే' అనే సినిమాతో దర్శకుడిగా మారి మొదటి సినిమాతోనే తన దర్శకత్వ ప్రతిభను కనబరిచాడు.


 ఇక ఆ తర్వాత మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు తీసి స్టార్ డైరెక్టర్ గా దూసుకెళ్తున్నాడు. ఇటీవల అల్లు అర్జున్ తో తీసిన 'అల వైకుంఠపురంలో' సినిమాతో ఏకంగా ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు ఈ దర్శకుడు. దీంతో ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ కి భారీ డిమాండ్ పెరిగింది. స్టార్ హీరోలందరూ సినిమాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఇదిలా ఉంటే డైరెక్టర్ కాకముందు త్రివిక్రమ్ పలు సినిమాలకు రచయితగా పనిచేసిన సంగతి తెలిసిందే కదా. అందులో మొట్టమొదటిగా ఆయన స్క్రిప్టు అందించిన మొదటి సినిమా 'నిన్నే ప్రేమిస్తా'.


 శ్రీకాంత్, నాగార్జున సౌందర్య హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా కథా, కథనం, పాటలు ప్రేక్షకులను అప్పట్లో ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రిప్ట్ అందించిన విషయం ఇప్పటికీ చాలామందికి తెలియదు. అంతే కాదు 'నువ్వేకావాలి' సినిమా తో డైలాగ్ రైటర్ గా కూడా మారారు త్రివిక్రమ్. ఆ తర్వాత 'స్వయంవరం' సినిమాకి కూడా డైలాగ్స్ అందించారు. ఈ సినిమాలతో ఆయనకు మంచి గుర్తింపు కూడా వచ్చింది  ఇక ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్నాడు త్రివిక్రమ్. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: