బాలకృష్ణతో ఆహాకు ఎంత లాభం అంటే..!
బాలయ్య ఈ షోలోకి ఎంట్రీ ఇవ్వడంతోనే ఆహా పై ఉన్న మెగా ముద్ర మొత్తం పోయింది. అసలు ఇంత డేరింగ్ స్టెప్ వేసిన అల్లు అరవింద్‌కు హ్యాట్సాప్ చెప్పాల్సిందే. విచిత్రం ఏంటంటే ఇంతకు ముందు ఆహా లో చాలా టాక్ షోలు చేసినా అవేవి సక్సెస్ కాలేదు. సరికదా .. వాటికి పెద్ద టాక్ కూడా లేదు. సమంత శామ్ జామ్ - రానా నెంబర్ వన్ యారీ - వైవా హర్ష తమాషా - మంచులక్ష్మి ఆహా భోజనంబు - ప్రదీప్ సర్కార్ వంటి టాక్ షో వల్ల అల్లు అరవింద్ కు రాని ప్రయోజనం బాలయ్య అన్ స్టాపబుల్ వల్ల వచ్చిందన్న టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.
బాలయ్య షో దెబ్బతో ఆహా సబ్ స్క్రైబర్స్ విపరీతంగా పెరిగి పోతున్నారట. ఇక ఫస్ట్ ఎపిసోడ్ లోనే కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో పాటు ఆయన కుమార్తె లక్ష్మీ ప్రసన్న, కుమారుడు మంచు విష్ణు రావడం పెద్ద సంచలనమే అయ్యింది. బాలయ్య ఫుల్ ఎనర్జీ తో ప్రశ్నలు అడుగుతున్నాడు. ఏదేమైనా బాలయ్య షోతో ఆహా మరో రేంజ్‌కు అయితే వెళ్లింది.